Gold Rate Today : బంగారం ధరల్లో మార్పులేదు.. వెండి మాత్రం.. ఈరోజు ఎంత ఉందంటే.. 

బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,690ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,940ల వద్ద నిలకడగా ఉన్నాయి.  ఇక వెండి ధర రూ.100పెరిగి  రూ.77,100 వద్ద ఉంది.

New Update
Gold Rate Today: మార్పులు లేని బంగారం.. వెండి ధరలు.. ఈరోజు ఎంతంటే.. 

Gold Rate Today : బంగారం(Gold) కొనాలని అనుకునే వారిని ఎప్పటికప్పుడు ధరల మార్పుతో టెన్షన్ పెడుతుంది. ఇటీవల వరుసగా తగ్గుతూ వస్తున్నా బంగారం ధర కాస్త ఊరట ఇచ్చింది. అయితే, ఈరోజు మాత్రం బంగారం ధరలు మార్పు లేకుండా స్థిరంగా నిలిచాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇది దేశీయంగానూ ప్రభావం చూపిస్తోంది. దీంతో ఈరోజు అంటే ఫిబ్రవరి 13న  నిలకడగా నిలిచాయి. బంగారం ధరల(Gold Rate Today) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుతూ ఉండడంతో .. స్థానికంగా బంగారం డిమాండ్ ఒక మోస్తరుగా  ఉన్నప్పటికీ బంగారం ధరలపై ప్రభావం చూపించిందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే ఫిబ్రవరి13న  అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర నిలకడగా ఉంది. దీంతో  దేశీయంగా బంగారం ధరలు మార్పులు లేకుండా నిలిచాయి.  మరోవైపు వరుసగా తగ్గుతూ వస్తున్న వెండి ధరలు కూడా ఈరోజు కాస్త పెరుగుదల కనబరిచాయి.  ఈరోజు అంటే మంగళవారం (ఫిబ్రవరి 13) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 

హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా.. 
ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర మార్పులు లేకుండా రూ. 57,690లుగా ఉంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం(Gold)10 గ్రాముల ధర స్థిరంగా రూ. 62,940ల వద్ద కొనసాగుతోంది. 

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా.. 
రాజధాని నగరం ఢిల్లీ(Delhi) లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర(Gold Rate Today) రూ. 57,840లుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,090లుగా ఉంది. 

వెండి ధరలు.. 
ఇక వెండి ధర(Silver Rate) విషయానికొస్తే.. వెండి ధరలు స్వల్పంగా కేజీకి 100 రూపాయలు పెరిగాయి. హైదరాబాద్(Hyderabad) లో కిలో వెండి రూ. 77,100 లుచేరుకుంది. ఢిల్లీలో వెండి కేజీకి రూ.75,600ల వద్ద ఉంది. 

Also Read:  ఇది షాకింగ్.. ఎక్కువ పన్ను కడుతున్నది కార్పొరేట్లు కాదు.. ఎవరంటే.. 

అంతర్జాతీయంగా.. 
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు(Gold Rate Today) తగ్గుదల కనబరుస్తున్నాయి.  ఈరోజు ఔన్స్ బంగారం 2025డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 22.68 డాలర్లుగా ఉంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.

Watch this Interesting Video :

Advertisment
Advertisment
తాజా కథనాలు