Gold Rate: రిలాక్స్.. బడ్జెట్ వేళ స్థిరంగా బంగారం ధరలు.. రెండు రోజులు పైకెగసిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,000ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,270ల వద్ద నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధర రూ.78,000 వద్ద మార్పులు లేకుండా ఉంది. By KVD Varma 01 Feb 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Gold Rate: బంగారం(Gold) కొనాలని అనుకునే వారిని ఎప్పటికప్పుడు ధరల మార్పుతో టెన్షన్ పెడుతుంది. అయితే, వరుసగా రెండు రోజులు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉండడం కాస్త ఊరట కల్పించినట్లే. బంగారం ధరలు మార్పులేకుండా ఉండడం అంటే.. కొనాలని అనుకునే వారికి మంచి అవకాశం గానే చెప్పవచ్చు. అంతర్జాతీయంగా బంగారం ధరలు నిలకడగా ఉండడంతో దేశీయంగానూ ప్రభావం చూపిస్తోంది. అంతకు ముందు వరుసగా రెండు రోజులు పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు అంటే ఫిబ్రవరి 1న నిలకడగా నిలిచాయి. బంగారం ధరల(Gold rate) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరలు నిలకడగా ఉండడం.. స్థానికంగా బంగారం డిమాండ్ ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ బంగారం ధరలపై ప్రభావం చూపించిందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే ఫిబ్రవరి 1న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర (Gold rate)స్థిరంగా ఉంది. దీంతో దేశీయంగా బంగారం ధరలు మార్పులు లేకుండా నిలిచాయి. మరోవైపు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే స్థిరంగా ఉన్నాయి. ఈరోజు అంటే గురువారం (ఫిబ్రవరి 1) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ లో బంగారం ధరలు : హైదరాబాద్(Hyderabad) లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate Today) రూ.58,000ల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకుమార్పులు లేకుండా రూ. 63,270ల వద్ద ఉంది. అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Rate Today) స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర(Gold rate) మార్పులేకుండా 10 గ్రాములకు రూ.58,150ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా స్థిరంగా రూ.63,420ల వద్దకు చేరుకుంది. Also Read : బడ్జెట్ లో ఆయుష్మాన్ భారత్ కు శుభవార్త వస్తుందా? వెండి ధరలు ఇలా : ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold rate) నిలకడగా ఉంటె.. వెండి ధరలు కూడా ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. హైదరాబాద్ లో వెండి కేజీ రూ.78,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి ధర రూ. 76,500 ల వద్ద ఉంది. అంతర్జాతీయంగా.. మరోవైపు అంతర్జాతీయంగానూ బంగారం ధరలునిలకడగా ఉన్నాయి. ఈరోజు ఔన్స్ బంగారం(Gold rate in India) 2035డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 23.11 డాలర్లుగా ఉంది. గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం. Watch this interesting Video : #gold-rate-in-hyderabad #gold-silver-price-today మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి