Gold Rate Today: గోల్డ్ లవర్స్ కి ఊరట..దిగివస్తున్న బంగారం.. వెండి ధరలు పెరిగాయ్! 

బంగారం కాస్త ఊరట కలిగిస్తోంది. వరుసగా రెండోరోజూ ధరలు తగ్గాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.61,250ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.67,820ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి  రూ.80,500 వద్ద ఉంది.

New Update
Gold Rate Today: బంగారం ధరల్లో మార్పులు లేవు.. ఈరోజు ఎంతుందంటే.. 

Gold Rate Today: భారీగా పెరుగుతూ కంగారు పెట్టిన బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వరుసగా రెండోరోజూ బంగారం ధరలు ఊరటనిచ్చాయి. బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఇక వెండి ధరలు మాత్రం భారీగా పెరిగి షాకిచ్చాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. బంగారం ధరల(Gold Rate Today) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో భారీగా తగ్గుదల నమోదు అయింది. అకస్మాత్తుగా డిమాండ్ తగ్గడం.. ఫెడ్ రేట్ల హడావుడిలో బంగారం వైపు మొగ్గు చూపిన ఇన్వెస్టర్స్ బంగారం నుంచి వెనక్కి తగ్గడంతో బంగారం ధరల్లో తగ్గుదలకు కారణంగా ఉంటున్నట్టు నిపుణులు భావిస్తున్నారు.  అంతర్జాతీయంగా బంగారం ధరలు ఇంకా తగ్గే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో బంగారం ధర మరి కాస్త తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.  

ఇక ఈరోజు అంటే మార్చి24న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Rate Today) తగ్గుదల నమోదు చేసింది.  దేశీయంగా ఆ ఎఫెక్ట్ కనిపించింది.  దీంతో భారత్ లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. ఈరోజు అంటే ఆదివారం (మార్చి24) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Price) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.                               

హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో నిన్న కాస్త దిగి వచ్చిన బంగారం ధరలు(Gold Rate Today).. ఈరోజు కూడా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold and Silver Price) 100 రూపాయలు తగ్గి రూ.61,250ల వద్ద ఉంది.  24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 110 రూపాయలు తగ్గి రూ.67,820ల వద్దకు చేరుకుంది. 

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Price) తగ్గాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 100 రూపాయలు తగ్గి ((Gold Rate Today)) రూ.61,400ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 110 రూపాయలు తగ్గి  రూ.66,970ల వద్ద నిలిచింది. 

Also Read :హమ్మయ్య..గోల్డ్ లవర్స్ ఊపిరి పీల్చుకోండి.. బంగారం ధరలు తగ్గాయ్! 

వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల(Gold Rate Today) తగ్గుదల తో ఉంటే.. మరోవైపు వెండి భారీగా పెరిగింది. హైదరాబాద్ లో వెండి కేజీకి ఏకంగా 1000 రూపాయలు పెరిగింది. దీంతో  రూ.80,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి 1000 రూపాయలు పెరిగింది. దీంతో  రూ. 77,500ల వద్దకు చేరుకుంది. 

అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీ తగ్గుదల  నమోదు చేశాయి.  ఈరోజు ఔన్స్ బంగారం(Gold Rate Today) నిన్నటి ధరల వద్దే నిలకడగా ఉంది.  దీంతో  2165.64  డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర కూడా మార్పులు లేకుండా (Silver Price) ఔన్స్ 24.68 డాలర్లుగా ఉంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.

Advertisment
Advertisment
తాజా కథనాలు