Gold Rate Record: తగ్గే ఛాన్స్ లేదంటున్న బంగారం.. ఆగని రికార్డు పరుగులు.. ఈరోజు ఎంతంటే.. 

వరుసగా రెండోరోజూ బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో రికార్డు స్థాయిలో బంగారం ధరలు ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.59,700ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.65,130ల వద్దకు చేరాయి. వెండి ధర కేజీకి  రూ.78,000 వద్ద ఉంది.

New Update
Gold Price Hike: వామ్మో..భగ్గుమన్న బంగారం..వెండి ధరల రికార్డులు.. ఎంత పెరిగాయంటే.. 

Gold Rate Record: బంగారం ధరలు రికార్డు గరిష్టాలను తాకిన తరువాత కూడా ఇంకా పెరుగుదల బాటలోనే ఉన్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి పెరుగుదల నమోదు చేస్తూ  వచ్చిన బంగారం ధరలు గత సెషన్ లో ఒక్కసారే బాగ్గుమన్న విషయం తెలిసిందే. గరిష్ట స్థాయిని తాకినా బంగారం ధరలు తగ్గుతాయేమో అనుకున్నవారికి షాక్ ఇస్తూ ఈరోజు కూడా బంగారం ధరలు పెరుగుదల నందుకు చేశాయి. అమెరికా ఫెడ్ రేట్లు తగ్గిస్తుంది అనే వార్తలు.. ఆర్ధిక అనిశ్చిత పరిస్థితులు కంటిన్యూ అవుతుండడం, వివిధ దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తుండడం, అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదలకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.  బంగారం ధరలు ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో మార్పులు.. స్థానికంగా పెళ్లిళ్ల సీజన్ ఇవన్నీ బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నట్టు నిపుణులు భావిస్తున్నారు.  ఈరోజు అంటే మార్చి 7న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Rate Record) బాగానే పెరిగింది.  ఈ అన్ని కారణాలతోనూ దేశీయంగానూ బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. మరోవైపు వరుసగా పెరుగుతూ వచ్చిన  వెండి ధరలు ఈరోజు కాస్త తగ్గుదల నమోదు చేశాయి.  ఈరోజు అంటే గురువారం (మార్చి7) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Rate Record) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.                     

హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో ఈరోజు బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి.  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold and Silver Price) 250 రూపాయలు పెరిగింది. దీంతో రూ.59,700ల వద్ద ఉంది.  24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 280 రూపాయల పెరుగుదల నమోదు చేసి  రూ. 65,130ల వద్దకు చేరుకుంది. 

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Rate Record) పెరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర(Gold and Silver) 250 రూపాయలు పెరిగింది. దీంతో రూ.59,850ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 280 రూపాయల పెరుగుదల నమోదు చేసి  రూ.65,280లు గా నమోదు అయింది.  

Also Read : ఇంక కొనలేమా..కొండెక్కుతున్న బంగారం ధరలు

వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల(Gold Rate Record)పెరుగుదల  వరకూ పరుగులు తీసిన వెండి ధరలు కాస్త దిగివచ్చాయి.   హైదరాబాద్ లో వెండి కేజీకి 200 రూపాయలు తగ్గి రూ.78,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి ధర 200 రూపాయలు తగ్గి రూ. 74,500ల వద్ద ఉంది. 

అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి.  ఒక్కరోజే ఏకంగా 35 డాలర్లు జంప్ అయింది బంగారం ధర. దీంతో ఈరోజు ఔన్స్ బంగారం(Gold Rate Hike)  2146డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర కాస్త పెరగడంతో(Gold And Silver Price) ఔన్స్ 24.07 డాలర్లుగా ఉంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.

Advertisment
Advertisment
తాజా కథనాలు