Gold Price: మరింత కిందకు బంగారం ధరలు.. ఈరోజు ఎంత తగ్గాయంటే.. బంగారం ధరల్లో పతనం కొనసాగుతోంది. ఈరోజు హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.55,450గానూ.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకుతగ్గి 60,490 రూపాయలు గానూ ఉంది. ఇక వెండి ధరలు భారీగా పతనం అయి కిలో వెండి రూ.74,500లకు చేరుకుంది. By KVD Varma 14 Nov 2023 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Gold Price Today: బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఆభరణాలుగా బంగారం కొనుక్కునే వారికి ఇది పెద్ద శుభవార్త. దీపావళి పండుగకు కూడా బంగారం ధరలు పెరగలేదు. దీపావళి (Diwali) వెళ్లిన తరువాత కూడా బంగారం ధరలు తక్కువగానే ఉన్నాయి. బంగారం అంటే ఇష్టపడే మహిళలకు ఇది సంతోషాన్ని ఇచ్చే విషయమే. అయితే, ఇన్వెస్టర్స్ అంటే బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఇది కొద్దిగా కష్టాన్ని కలిగించే విషయం. ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దామనుకునే వారికి బంగారం ధరలు తగ్గడం కలిసి వచ్చే పరిస్థితి అనే చెప్పవచ్చు. గత వారం అంతా బంగారం ధరలు(Gold Price) కింది చూపులు చూశాయి. మంగళవారం (నవంబర్ 14) కూడా బంగారం ధరలు దేశీయంగా బాగా తగ్గాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం, బులియన్ మార్కెట్‌లో ఈరోజు ఉదయం మార్కెట్ ప్రారంభం అయ్యేసరికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.348 తగ్గి రూ.59,892కి చేరుకుంది. వెండి (Silver Price) రూ.1016 తగ్గి రూ.69,400కి చేరింది. ఇక హైదరాబాద్ (Hyderabad) లో కూడా బంగారం ధరలు కిందికే చూస్తున్నాయి. ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 90 రూపాయలు తగ్గి రూ.55,450 వద్దకు చేరుకుంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 100 రూపాయలు తగ్గి 60,490 రూపాయలకు దిగివచ్చింది. అదేవిధంగా వెండి ధరలు కూడా ఈరోజు భారీగా పతనం అయ్యాయి. హైదరాబాద్ లో కిలో వెండి ఈరోజు 600 రూపాయలు తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.74,500లుగా ఉంది. Also Read: రామాయణం చెప్పే ఫైనాన్షియల్ పాఠాలు ఇవే.. డబ్బు లెక్కలకూ రామకథ ఆదర్శమే! ఈ నెలలో బంగారం ధరలు రూ.1120 తగ్గాయి.. ఈ నెలలో ఇప్పటివరకు బంగారం ధర రూ.1120 తగ్గింది. నవంబర్ 1న రూ.61,012గా ఉంది. వెండి కూడా రూ.1,584 తగ్గింది. నవంబర్ మొదటి రోజున ఇది రూ.70,984గా ఉంది. అంతకుముందు అక్టోబర్‌లో బంగారం, వెండి ధరలు అనూహ్యంగా పెరిగాయి. బంగారం ధర(Gold Price) రూ.3,651 పెరిగింది. అక్టోబర్ ప్రారంభంలో అంటే అక్టోబర్ 1న 10 గ్రాములు రూ.57,719 వద్ద ఉండగా, అక్టోబర్ 31 నాటికి రూ.61,370కి చేరింది. వెండి కిలో రూ.71,603 నుంచి రూ.72,165కి తగ్గింది. ఈసారి ధన్‌తేరస్‌లో 42 టన్నుల బంగారాన్ని విక్రయించగా.. ధన్‌తేరస్‌లో (Dhanteras) ఈసారి 42 టన్నుల బంగారం విక్రయించినట్లు ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) జనరల్ సెక్రటరీ సురేంద్ర మెహతా తెలిపారు. ఇటీవలి ధరల పతనం ఇందులో పెద్ద పాత్ర పోషించింది. గతేడాది ధన్‌తేరస్‌లో 39 టన్నుల బంగారం అమ్ముడుపోయింది. Watch this interesting Video: #gold-price-today #gold-price #gold-and-silver-price #gold-rate-today #gold-price-today-hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి