SGB Investment: రూపాయి పెడితే రూపాయి పావలా లాభం.. బంగారం లాంటి పెట్టుబడి.. బంగారంపై ఇన్వెస్ట్ చేయడం ఆంటే ఎప్పుడూ సురక్షితమైనదే. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడి కోసం బంగారం బెస్ట్ ఆప్షన్ కూడా. గోల్డ్ సావరిన్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే లాభాల పంట.. సావరిన్ గోల్డ్ బాండ్ మొదటి విడత 128% ప్రాఫిట్స్ ఇచ్చింది. By KVD Varma 18 Dec 2023 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి SGB Investments: బంగారం అంటే మన దేశంలో విపరీతమైన క్రేజ్. ఆభరణాలుగా.. అలంకరణ కోసం బంగారం కొనడం సాధారణంగా జరుగుతుంది. అలాగే, బంగారాన్ని మంచి ఇన్వెస్ట్మెంట్ సాధనంగా కూడా చెప్పుకోవచ్చు. బంగారంలో పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాబడులు కూడా సంప్రదాయ పెట్టుబడులపై వచ్చే లాభాలకన్నా ఎక్కువే ఉంటాయి. ఇటీవల కాలంలో బంగారంపై పెట్టుబడులు పెట్టాలంటే అనేక రకాల ఆప్షన్స్ వచ్చాయి. భౌతికంగా బంగారం కొనడం.. అలాగే ఆన్లైన్ లోనూ బంగారం కొనే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ లో బంగారం కొనుగోలు చేయడానికి ప్రభుతం గోల్డ్ బాండ్స్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. గోల్డ్ బాండ్స్ కొనడం అంటే బంగారం కొన్నట్టే. కాకపొతే మన బంగారం బాండ్స్ రూపంలో ఉంటుంది అంతే. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్స్ లో ఈ నెల 18 నుంచి 22 వరకూ ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంది. ఈసారి ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్(SGB Investments) ధరను గ్రాముకు రూ.6,199గా నిర్ణయించింది. అంటే.. ఇది ఈరోజు ఉన్న బంగారం ధరకంటే తక్కువ. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు 64 వేల రూపాయల కంటే ఎక్కువగానే ఉంది. అంటే సావరిన్ గోల్డ్ బాండ్స్ తో ఇది 61,990 రూపాయలకే దొరుకుతుంది. అలాగే బాండ్స్ ఆన్లైన్ లో కొంటె కనుక ఈరేటుపై 50 రూపాయల డిస్కౌంట్ ఇస్తారు. అప్పడు 10 గ్రాముల బంగారం బాండ్స్ రూపంలో కొనాలంటే.. 61,490 రూపాయలకే దొరుకుతుంది. దాదాపు 2500 రూపాయలు తక్కువ పడుతుంది. అసలు సావరిన్ గోల్డ్ బాండ్ అంటే ఏమిటి ఇప్పుడు చూద్దాం. సావరిన్ గోల్డ్ బాండ్(SGB Investments) అనేది ప్రభుత్వ బాండ్. దీన్ని డీమ్యాట్‌గా మార్చుకోవచ్చు. ఈ బాండ్ 1 గ్రాము బంగారం, అంటే బాండ్ ధర 1 గ్రాము బంగారం ధరతో సమానంగా ఉంటుంది. దీనిని ఆర్‌బిఐ జారీ చేస్తుంది. అందువల్ల సురక్షితమైన పెట్టుబడిగా చెప్పవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్‌లో, మీరు 24 క్యారెట్ అంటే 99.9% స్వచ్ఛమైన బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. SGBలలో పెట్టుబడులపై 2.50% వార్షిక వడ్డీ వస్తుంది. డబ్బు అవసరమైతే, బాండ్‌పై లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ అంటే IBJA రేటు ఆధారంగా బాండ్ ధర నిర్ణయిస్తారు. ఇందులో, సబ్‌స్క్రిప్షన్ వ్యవధికి ముందు వారంలోని చివరి మూడు రోజుల రేట్ల సగటు లెక్కిస్తారు. SGBలలో స్వచ్ఛత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ప్రకారం, ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రచురించిన 24 క్యారెట్ల స్వచ్ఛత బంగారం ధరతో బంగారు బాండ్ల ధర ముడిపడి ఉంది. దీనితో పాటు, దీనిని డీమ్యాట్ రూపంలో ఉంచవచ్చు, ఇది చాలా సురక్షితమైనది- దానిపై ఎటువంటి ఖర్చు ఉండదు. SGB Investments ద్వారా, ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో కనీసం 1 గ్రాము - గరిష్టంగా 4 కిలోల బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు . జాయింట్ హోల్డింగ్ విషయంలో, 4 కిలోల పెట్టుబడి పరిమితి మొదటి దరఖాస్తుదారుపై మాత్రమే వర్తిస్తుంది. ట్రస్ట్ కోసం గరిష్టంగా కొనుగోలు చేసే పరిమితి 20 కిలోలుగా ఉంది. . సావరిన్ బాండ్స్(SGB Investments) మెచ్యూరిటీ వ్యవధి 8 సంవత్సరాలు. మెచ్యూరిటీ వ్యవధి పూర్తయిన తర్వాత, దాని నుంచి వచ్చే లాభాలపై పన్ను ఉండదు. అయితే మీరు మీ డబ్బును 5 సంవత్సరాల తర్వాత ఉపసంహరించుకుంటే, దాని నుంచి వచ్చే లాభం దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG) రూపంలో 20.80% పన్ను విధిస్తారు. .మీరు ఆఫ్‌లైన్‌లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు Also Read: రాబోయే కాలానికి ఈ ఏడాది సరికొత్త ఆశల్ని మోసుకొచ్చిన కొత్త కార్లు ఇవే RBI పెట్టుబడి కోసం అనేక ఎంపికలను ఇచ్చింది. బ్యాంకు శాఖలు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు - స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SHCIL) ద్వారా పెట్టుబడులు నుంచి నుండి డబ్బు డెబిట్ అవుతుంది. ఈ బాండ్లను అన్ని బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SHCIL), గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NSE) - బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (BSE) ద్వారా విక్రయిస్తారు. మొదటి శ్రేణి సావరిన్ గోల్డ్ బాండ్‌లు నవంబర్ 30న మెచ్యూర్ అయ్యాయి. ఈ బాండ్లను నవంబర్ 26, 2015న ఒక గ్రాముకు రూ.2,684 ఇష్యూ ధరతో జారీ చేశారు. హోల్డర్ దానిని యూనిట్‌కు రూ.6,132 చొప్పున రీడీమ్ చేశారు. దీని ప్రకారం, గత 8 సంవత్సరాలలో ఇచ్చిన మొత్తం రాబడి 128.5%. అంటే ఉదాహరణకు నవంబర్ 2015లో ఒక ఇన్వెస్టర్ గోల్డ్ బాండ్లలో రూ.లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ నవంబర్ 30, 2023న దాదాపు రూ.2.28 లక్షలు అందుకున్నాడు. అంటే 8 ఏళ్లలో ఈ పెట్టుబడిపై దాదాపు రూ.1.28 లక్షల ఆదాయం వచ్చింది. అదండీ విషయం సావరిన్ గోల్డ్ బాండ్లను తీసుకోవం మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే, పెట్టుబడులు అనేవి ఎప్పుడూ రిస్క్ తోనే ఉంటాయి. అన్నిసార్లూ లాభాలు ఇస్తాయని కచ్చితంగా చెప్పలేం. ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టె ముందు మీ ఆర్ధిక సలహాదారుని సలహాలు… సూచనలు తీసుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నాం. Watch this interesting Video: #gold #gold-bonds మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి