Gold and Silver: బంగారం ధరలు దిగి వస్తున్నాయి..వెండి ధర భారీగా పడిపోయింది..ఈరోజు ఎంతుందంటే.. 

బంగారం ధరలు వరుసగా మూడో రోజు కూడా తగ్గాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.400 తగ్గి రూ.58,100ల వద్దకు, 24 క్యారెట్ల బంగారం 430 తగ్గి రూ.63,380కు చేరింది.  ఇక వెండి ధర కూడా కేజీకి రూ.2000 తగ్గి రూ.78,000 వద్దకు చేరుకుంది.

New Update
Gold and Silver: బంగారం ధరలు దిగి వస్తున్నాయి..వెండి ధర భారీగా పడిపోయింది..ఈరోజు ఎంతుందంటే.. 

Gold and Silver Rates Dropped : వరుసగా మోత మోగిస్తున్న బంగారం ధరలు కిందికి దిగి వస్తున్నాయి. బంగారం కొనాలని అనుకునే వారి ఆశలను పెంచుతున్నాయి. ఇటీవల కాలంలో బంగారం రికార్డు స్థాయి ధరల్లోకి వెళ్ళిపోయింది. కానీ, కొత్త సంవత్సరంలో మెల్లగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా రెండురోజులు తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు కూడా మరింత తగ్గాయి. బంగారం ధరల తగ్గుదల పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ఇప్పుడు అనిశ్చితంగా ఉన్నాయి. అలాగే యూఎస్ ఫెడ్ రేట్లు గతేడాది బాగా పెంచారు. అయితే, ఈ ఏడాది మూడుసార్లు ఫెడ్ వడ్డీరేట్లు తగ్గుతాయని వార్తలు వస్తున్నాయి. దీంతో డాలర్ విలువ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. మొత్తమ్మీద బంగారం ధరలు(Gold and Silver) తగ్గుముఖం పట్టడం అనేది సామాన్యులకు కాస్త ఊరట ఇచ్చే అంశమని చెప్పవచ్చు. ఈరోజు అంటే జనవరి 05న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధరల్లో కాస్త తగ్గుదల కనిపించడంతో  దేశీయంగాను బంగారం ధరలు(Gold and Silver) దిగి వచ్చాయి. మరోవైపు వెండి ధరలు భారీగా పడిపోయాయి.  ఈరోజు అంటే శుక్రవారం (జనవరి 05) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.      

 హైదరాబాద్(Hyderabad) లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold and Silver) 400 రూపాయలు తగ్గింది. దీంతో  రూ.58,100ల వద్ద చేరుకుంది.  24 క్యారెట్ల బంగారం కూడా 440 రూపాయలు తగ్గి రూ. 63,530ల వద్దకు చేరింది.  అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి.  ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయలు తగ్గి రూ.58,250ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate Today) ధర 440 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది దీంతో  రూ.63,380ల వద్దకు చేరుకుంది. 

Also Read: వామ్మో.. తులం బంగారం రూ.70 వేలా?

ఇక వెండి ధరలు నిన్న కాస్త తగ్గాయి. అయితే,ఈరోజు భారీగా పడిపోయాయి. బంగారంతో పాటు వెండి ధరలు(Gold and Silver) కూడా తాగుతూనే వస్తున్నాయి. కానీ ఈరోజు భారీగా వెండి దరల పతనం కనిపించింది. వెండి ధరలు కేజీకి 2000 రూపాయలు పడిపోయాయి.  దీంతో  హైదరాబాద్ లో వెండి కేజీకి  రూ.78,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు కేజీకి 2000 రూపాయలు పతనం అయింది. దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 76,600 లుగా ఉంది.  

అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు(Gold Rates) కాస్త తగ్గాయి. ఈరోజు ఔన్స్ బంగారం(Gold and Silver)  2040 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 23 డాలర్లుగా కొనసాగుతోంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు