Gold and Silver Price: బంగారం కొనాలంటే ఇప్పట్లో అయ్యేలా లేదు.. ధరల మోత ఆగడం లేదు! వరుసగా నాలుగోరోజూ బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో రికార్డు స్థాయిలో బంగారం ధరలు ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,250ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.65,730ల వద్దకు చేరాయి. వెండి ధర కేజీకి రూ.79,000 వద్ద ఉంది. By KVD Varma 09 Mar 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Gold and Silver Price: బంగారం కొనగలిగే స్థాయి దాటిపోయి చాలారోజులు అయిపోయింది. మార్చి నెల ప్రారంభం నుంచే బంగారం ధరలు పరుగులు తీయడం మొదలైంది. ఇప్పటికీ బ్రేక్ లేకుండా పెరుగుదల కొనసాగుతోనే ఉంది. ఈ క్రమంలో బంగారం ధరలు పాత రికార్డులు చెరిగిపోయాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి బంగారం ధరలు. మరోవైపు వెండి కూడా బంగారానికి ఏమాత్రం తీసిపోకుండా పరుగులు తీస్తూనే ఉంది. అమెరికా ఫెడ్ రేట్లు తగ్గిస్తుంది అనే వార్తలు.. ఆర్ధిక అనిశ్చిత పరిస్థితులు కంటిన్యూ అవుతుండడం, వివిధ దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తుండడం, అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదలకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో మార్పులు.. స్థానికంగా పెళ్లిళ్ల సీజన్ ఇవన్నీ బంగారం ధరలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే మార్చి 9న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold and Silver Price) బాగానే పెరిగింది. ఈ అన్ని కారణాలతోనూ దేశీయంగానూ బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. మరోవైపు వరుసగా మూడోరోజూ వెండి ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు అంటే శనివారం (మార్చి9) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold and Silver Price) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ లో బంగారం ధరలు.. హైదరాబాద్(Hyderabad) లో వరుసగా నాలుగోరోజు కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold and Silver Price) 150 రూపాయలు పెరిగింది. దీంతో రూ.60,250ల వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 170 రూపాయల పెరుగుదల నమోదు చేసి రూ.65,730ల వద్దకు చేరుకుంది. ఢిల్లీలో బంగారం ధరలు ఇలా.. అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold and Silver Price) పెరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర(Gold and Silver Price) 150 రూపాయలు పెరిగింది. దీంతో రూ.60,400ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 170 రూపాయల పెరుగుదల నమోదు చేసి రూ.65,880లు గా నమోదు అయింది. Also Read : తగ్గే ఛాన్స్ లేదంటున్న బంగారం.. ఆగని రికార్డు పరుగులు.. ఈరోజు ఎంతంటే.. వెండి ధరలు ఇలా.. ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల(Gold Rate Hike)పెరుగుదల మధ్యలో వెండి కూడా పెరుగుతూ వస్తోంది. ఈరోజు కూడా వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో వెండి కేజీకి 500 రూపాయలు పెరిగి రూ.79,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి ధర 500 రూపాయలు పెరిగి రూ. 75,500ల వద్ద ఉంది. అంతర్జాతీయంగా.. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి. దీంతో ఈరోజు ఔన్స్ బంగారం(Gold Rate Hike) 2178డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర కాస్త పెరగడంతో(Gold And Silver Price) ఔన్స్ 24.31డాలర్లుగా ఉంది. గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది. #gold #gold-rate-in-hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి