Ayodhya: అయోధ్యకు వెళ్తున్నారా? ఈ బీచ్ ను చూడటం అస్సలు మర్చిపోకండి..మాల్దీవులకు మించిన అందాలు..!!

బాలరాముడిని దర్శించుకునేందుకు అయోధ్య వెళ్తున్నారా? అయితే భవ్యరాముడిని దర్శించుకున్న తర్వాత యూపీలో ఉన్న చుకా బీచ్ కు వెళ్లండి. అచ్చం సముద్రపు బీచ్ లా ఉంటుంది. చుకా బీచ్ సూర్యస్తమయం అద్భుతంగా ఉంటుంది. అయోధ్య నుంచి 380కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

New Update
Ayodhya: అయోధ్యకు వెళ్తున్నారా? ఈ బీచ్ ను చూడటం అస్సలు మర్చిపోకండి..మాల్దీవులకు మించిన అందాలు..!!

Ayodhya: అయోధ్య రామమందిరం(Ram Mandir) ప్రాణప్రతిష్ట తర్వాత అయోధ్యాపురికి కొత్త శోభ సంతరించుకుంది.దేశం నుంచే కాదు ప్రపంచదేశాల నుంచి కూడా అయోధ్యా రాముడిని దర్శించుకునేందుకు రామజన్మభూమి బాట పట్టారు. మీరు కూడా ఆ భవ్యరాముడిని దర్శించుకునేందుకు వెళ్తున్నారా? అయితే ఈ రామచంద్రస్వామిని దర్శించుకున్న తర్వాత యూపీ(uttar pradesh)లోనే ఉన్న ఓ అందమైన బీచ్ చూడటం అస్సలు మిస్సవ్వకండి. దాని అందాల మాల్దీవులకు మంచి ఉంటాయి.

పిలిభిత్(Pilibhit) జిల్లాలోని శారదా డ్యామ్(Sarada Dam) ఒడ్డున ఉంది చుకా బీచ్(Chuka Beach). అచ్చం సముద్రపు బీచ్ వలె కనిపిస్తుంది. నవంబర్ 15నుంచి జూన్ 15 వరకు ఈ ప్రాంతానికి పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. సాధారణంగా ఉత్తరప్రదేశ్ కు బీచ్ ఉండదనే డౌట్ మీకు రావచ్చు. కానీ ఇది సముద్ర తీరం కాదు. అందువల్ల పర్యాటకులు ఈ బీచ్ కు వచ్చి సరదాగా గడుపుతుంటారు. పర్యాటకులే కాదు సాక్ష్యాత్తు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ (CM Yogi Adityanath)కూడా చుకా బీచ్ వీరాభిమాని. దీనిని బట్టి అర్థమవుతుంది యూపీలో ఉన్న ఈబీచ్ ఎంత ఫేమసో. గతేడాది అక్టోబర్ లో సీఎం యోగి ఆదిత్యానాథ్ మంత్రులతో కలిసి ఈ అందమైన బీచ్ ను సందర్శించి కాసేపు సేదతీరారు.

ఇక చుకా బీచ్ లో సూర్యస్తమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడి నుంచి సూర్యస్తమయం వీక్షించేందుకు చాలా మంది పర్యాటకులు తరలివస్తుంటారు. గతేడాది చుకా బీచ్ లో బస చేసేందుకు గవర్నర్ ఆనందీబెన్ పటేల్(Anandiben Patel) కూడా ఈ సూర్యస్తమయ సమయానికి అభిమానిగా మారారు. ఇక అక్కడికి వెళ్లిన పర్యాటకులకు బస చేసేందుకు గుడిసెలు ఉంటాయి. రాత్రి అక్కడ స్టే చేయవచ్చు. పర్యాటాకులు బస చేసేందుకు ట్రీ హట్(Tree Hut), వెదురు గుడిసెలు ఉన్నాయి. మాల్దివుల(Maldives) మాదిరిగానే నీటిలో ఉండే కాటేజీలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

అటు చెట్టుపై ఉండు గుడిసెలు కూడా ఉన్నాయి. వాటిపై ఉండేందుకు చాలా మంది పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే అక్కడ ఉండాలంటే అడ్వాన్స్ గా బుకింగ్ చేసుకోవాలి. www.upecotourism.in లాగిన్ అయి ఈ కాటేజీలను బుక్ చేసుకోవచ్చు. మీరు కూడా చుకా బీచ్ ను చూడాలనుకుంటే ముందుగా పిలిభిత్ జిల్లా కేంద్రానికి చేరుకోవాలి. అక్కడి నుంచి కాళీనగర్ చేరుకుని మధోతండా ఖతిమా రోడ్డుకు వెళ్లాలి. ఈ మార్గంలో ఉన్న చుకా ఎంట్రీ పాయింట్ నుంచి బీచ్ కు చేరుకోవచ్చు. అయోధ్య నుంచి చుకా బీచ్ దాదాపు 380 కిలో మీటర్లు ఉంటుంది. అయోధ్యకు వెళ్లేవారు శ్రీరాముడిని దర్శించుకున్న తర్వాత ఇతర పర్యాటకు ప్రాంతాలకు కూడా వెళ్లవచ్చు.

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్…55వేల జీతంతో అదిరే ఉద్యోగం..ఇలా అప్లయ్ చేసుకోండి..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు