General Elections 2024 : నెహ్రూ, ఇందిరా గాంధీల సరసన మోదీ నిలుస్తారా.. ఆ రికార్డు సమం చేస్తారా?

మోదీ మరోసారి యూపీలోని వారణాసి నుంచి పోటి చేయనున్నారు. ఈసారి మోదీ విజయం సాధిస్తే నెహ్రూ, ఇందిరా గెలుపు రికార్డును సమం చేస్తారు. గతంలో యూపీ నుంచి నెహ్రూ, ఇందిరా మూడుసార్లు ఎంపీగా గెలిచారు. ఈ ఇద్దరు ప్రధానులు మాత్రమే యూపీ నుంచి ఇప్పటివరకు మూడు సార్లు గెలిచారు.

New Update
General Elections 2024 : నెహ్రూ, ఇందిరా గాంధీల సరసన మోదీ నిలుస్తారా.. ఆ రికార్డు సమం చేస్తారా?

PM Modi Eye on Hattrick Win in Varanasi : మోదీ(PM Modi) దూకుడు మాములుగా ఉండదు.. ఏడు పదులు వయసు దాటినా ఆలోచన మాత్రం టీనేజ్‌ పిల్లాడిలానే ఉంటుంది. పార్టీ కోసమైనా, వ్యక్తిగత విజయం కోసమైనా ఆయన వేసే అడుగులు ఏదో ఒక రికార్డు సృష్టించేలా ఉంటాయి. జనరల్‌ ఎలక్షన్స్‌(General Elections) కోసం బీజేపీ ఫస్ట్‌ లిస్ట్‌(BJP First List) ను రిలీజ్ చేసింది. 195మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాలో మోదీ ఊహించినట్టుగానే వారణాసి(Varanasi) నుంచి పోటి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఖాతాలో ఓ రికార్డు వచ్చి పడనుంది.

నాడు ఇందిరా నేడు మోదీ:
దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ(Pandit Jawaharlal Nehru), మూడో ప్రధాని ఇందిరా గాంధీ(Indira Gandhi) ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) నుంచి పలుమార్లు ఎంపీగా గెలిచారు. మొత్తం మూడుసార్లు యూపీ నుంచి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఇప్పుడు ప్రధాని వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటి చేస్తున్నారు. ఈసారి కూడా ఆయన గెలుస్తారన్న అంచనాలు నెలకొన్నాయి. అదే జరిగితే యూపీ నుంచి మూడు సార్లు ఎన్నికల విజయాల సాధించిన ప్రధానుల జాబితాలో చేరిపోతారు. నెహ్రూ ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని ఫుల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో విజయం సాధించారు. అలాగే ఇందిరా గాంధీ రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎన్నికల్లో విజయం సాధించారు. నెహ్రూ 1952, 1957, 1962 ఎన్నికలలో ఫుల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇందిరా గాంధీ 1967, 1971 మరియు 1980 ఎన్నికల్లో రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా గాంధీ రాయ్ బరేలీ నుంచి జనతా పార్టీకి చెందిన రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయారు. ఇక మోదీ లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి వరుసగా ఇప్పటికే రెండుసార్లు విజయం సాధించారు.

యూపీ నుంచి ప్రధానులు:
అటు 20 ఏళ్లుగా కాశీ ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) బయటి అభ్యర్థులను మాత్రమే ఇష్టపడుతున్నారు. వారణాసి నుంచి 2004 లోక్‌సభ ఎన్నికల్లో డియోరియాలో జన్మించిన కాంగ్రెస్ నాయకుడు రాజేష్ కుమార్ మిశ్రా గెలుపొందారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో జన్మించిన బీజేపీకి చెందిన డాక్టర్ మురళీ మనోహర్ జోషి విజయం సాధించారు. గుజరాత్‌లోని వాద్‌నగర్ గ్రామంలో జన్మించిన మోదీ 2014 నుంచి వారణాసి ఎంపీగా కొనసాగుతున్నారు. అంతకుముందు 1991 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీలో జన్మించిన మాజీ ఐపీఎస్ శ్రీశ్ చంద్ర దీక్షిత్ బీజేపీ గుర్తుపై గెలిచారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని పార్లమెంటు స్థానాల నుంచి ఎన్నికల్లో గెలిచిన వారిలో ఎనిమిది మంది నేతలు ప్రధానులు అయ్యారు. వీరిలో నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, చౌదరి చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్‌పేయి, నరేంద్ర మోదీ ఉన్నారు.

Also Read : మరో పదేళ్లపాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండాలి.. ఏపీ హైకోర్టులో పిల్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు