BREAKING : లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేసిన మోదీ.. ఏ క్షణంలోనైనా లిస్ట్‌ రిలీజ్!

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ దూకుడు పెంచారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల లిస్ట్‌పై కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే తొలి జాబితా సిద్ధమైందని తెలుస్తోంది. నిన్న మిడ్‌నైట్‌ బీజేపీ కీలక నేతలతో మీటింగ్‌ పెట్టిన మోదీ తొలి జాబితా రిలీజ్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు.

New Update
NITI Aayog: నేడు నీతి ఆయోగ్ భేటీ.. పలు రాష్ట్రాలు బాయ్‌ కాట్‌

General Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) అర్థరాత్రి మీటింగ్‌ పెట్టారు. కేంద్ర ఎన్నికల కమిటీ(CEC) సమావేశం తర్వాత బీజేపీ(BJP) కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ మీటింగ్‌లో 100 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాకు మోదీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొదటి జాబితా ఏ క్షణంలోనైనా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) పార్టీ ఓడిపోయిన స్థానాలపై మోదీ ప్రధానంగా ఫోకస్‌ చేసినట్టుగా సమాచారం. ఇక మోదీ(వారణాసి), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(గుజరాత్‌-గాంధీనగర్), రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) (లక్నో) లాంటి హై ప్రొఫైల్ అభ్యర్థులు తొలి జాబితాలోనే ఉండే ఛాన్స్ ఉంది.

ఇక కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి స్థానంలో దిబ్రూగఢ్ నుంచి సర్బానంద సోనోవాల్‌ను బరిలోకి దింపవచ్చని బీజేపీ(BJP) వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో కొత్త ముఖాలు పోటీ చేయవచ్చని సమాచారం. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో నాలుగింటిలో కొత్త ముఖాలు టిక్కెట్లు పొందవచ్చట. అటు గోవాలో ఒక స్థానంలో కొత్త ముఖాన్ని రంగంలోకి దింపేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. అదే సమయంలో మరో స్థానంలో మహిళా అభ్యర్థికి బీజేపీ టిక్కెట్టు ఇవ్వవచ్చు.

తెలంగాణ సంగతేంటి?
ఇటు తెలంగాణ బీజేపీ ఎంపీ(Telangana BJP MP) అభ్యర్థులగా ఎవరి పేర్లు ఉంటాయన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. సిట్టింగ్‌ ఎంపీల్లో ముగ్గురికి టికెట్లు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి, కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌, నిజామాబాద్‌ నుంచి ధర్మపురి అర్వింద్‌కి టికెట్ కన్ఫమ్‌ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటు మహబూబ్‌నగర్‌ నుంచి డీకే అరుణ, వరంగల్‌-కృష్ణప్రసాద్‌, మల్కాజ్‌గిరి-ఈటల రాజేందర్‌, మెదక్‌-రఘునందన్‌రావు, నాగర్‌కర్నూల్‌-పి.భరత్‌, భువనగిరి- బూర నర్సయ్యగౌడ్‌, నాగర్‌కర్నూల్‌ సిట్టింగ్‌ ఎంపీ రాములు కుమారుడికి టికెట్‌ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. కల్వకుర్తి ZPTCగా ఉన్న పోతుగంటి భరత్‌ప్రసాద్‌, ఇటివలి బీజేపీలో చేరిన పి.రాములు, ఆయన కుమారుడుకి టికెట్‌ ఇస్తారని పొలిటిక్‌ సర్కిల్‌లో టాక్‌ వినిపిస్తోంది. అయితే బీజేపీ విడుదల చేయనున్న తొలి జాబితా(100మంది)లో వీరిలో ఎవరి పేర్లు ఉంటాయో చూడాలని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : 10లక్షల మంది విద్యార్థులకు అండ.. నేడు ‘జగనన్న విద్యా దీవెన’ జమ!

Advertisment
Advertisment
తాజా కథనాలు