Hyderabad : అమెజాన్ పార్సిల్‌లో గంజాయి కలకలం.. ఇద్దరు విద్యార్థులు అరెస్ట్

మేడ్చల్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయి పార్సిల్‌ను ఎస్‌ఓటి టెమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ గంజాయి అమెజాన్ పార్సిల్‌లో పెట్టిమరి తరలిస్తున్నారు. పట్టుబడిన గంజాయి రెండు కిలోల ఉన్నట్లు గుర్తించారు.

New Update
Hyderabad : అమెజాన్ పార్సిల్‌లో గంజాయి కలకలం.. ఇద్దరు విద్యార్థులు అరెస్ట్

Amazon : మేడ్చల్‌(Medchal) లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయి పార్సిల్‌(Ganja Parcel) ను ఎస్‌ఓటి టెమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ గంజాయి అమెజాన్ పార్సిల్‌(Amazon Parcel) లో పెట్టిమరి తరలిస్తున్నారు. పట్టుబడిన గంజాయి రెండు కిలోల ఉన్నట్లు గుర్తించారు. గంజాయిని అమెజాన్ కొరియర్‌లో అక్రమంగా తరలిస్తున్నారని పక్క సమాచారం అందుకున్న పోలీసులు ఎట్టకేలకు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి వారిని విచారిస్తున్నారు. అయితే ఈ గంజాయి ఒరిస్సా(Odisha) నుంచి హైదరాబాద్‌(Hyderabad) కు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ గ్యాంగ్‌ను వేనుక సూత్రధారులెవరూ, ఎలా చేస్తున్నారు.. దానిపై పోలీసులు పూర్తి విచారణ చేస్తున్నారు.

అయితే.. గంజాయి స్మగ్లింగ్ చేయడానికి ఆన్ లైన్ ప్లాట్ ఫాం ద్వారా విక్రయాలకు కొత్త దారులను వెతుకుతున్నారు. గతంలో కూడాకూరగాయల, బొగ్గు, ఉల్లిగడ్డ, లారీలలో.. అంబులెన్స్‌, రైళ్లలో, గ్యాస్ సిలెండర్లు, ఆర్టీసీ బస్సులు వంటి వాటిల్లో గంజాయిని అక్రమంగా తరలించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అక్రమార్కులు ఏకంగా ఆన్‌లైన్ ఫ్లాట్ ఫాం ద్వారా విక్రయాలు చేయటంపై అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి విషయాలు వెలుగులోకి రావటంతో పొలీసులు నిఘా పెంచారు. ఈ కేసుపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: గర్భిణుల కోరికలను కాదనకూడదట..ఎందుకో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు