Gangster : గ్యాంగ్‌స్టర్ లఖ్బీర్ సింగ్ ఉగ్రవాదే..భారత ప్రభుత్వం ప్రకటన

కెనడాలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లఖ్బీర్ సింగ్ లండా ఉగ్రవాదే అంటూ ప్రకటన జారీ చేసింది భారత ప్రభుత్వం. ఉపా చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రహోంశాఖ తెలిపింది.

New Update
Gangster : గ్యాంగ్‌స్టర్ లఖ్బీర్ సింగ్ ఉగ్రవాదే..భారత ప్రభుత్వం ప్రకటన

UPA Act : గ్యాంగ్ స్టర్ లఖ్బీర్ సింగ్(Lakhbir Singh) లాండా ...2021లో మొహాలీలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్ మీద రాకెట్ దాడి ప్రణాళికలో భాగస్వామ్యుడు. 2022 డిసెంబరులో తరన్ తరణ్ లోని సర్హాలీ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఆర్పీజీ దాడి ఘటనలోనూ లాండా పాత్ర ఉంది. ఇవి కాక ఇంకా బోలెడు తీవ్రవాద కార్యకలాపాల్లోనూ కీలకపాత్ర పోషించాడు. తరువాత ఇతను కెనడా పారిపోయి అక్కడ స్థిరపడ్డాడు. అక్కడి నుంచి కూడా భారత్ కు వ్యతిరేకంగా జరిగిన కుట్రల్లో లఖ్బీర్ కు ప్రమేయం ఉంది. అందుకే అతనిని ఉపా చట్టం(UPA Act) కింద ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నామని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

Also Read:సలార్ సాంగ్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రేమ

లఖ్బీర్ సింగ్ వయసు ౩౩ ఏళ్ళు. ఇతని స్వస్థలం పంజాబ్ లోని తరన్ జిల్లా. లఖ్బీర్‌ మీద దోపిడీ, హత్యలు, మాద ద్రవ్యాల సరఫరాలాంటి కేసుల్లో పంజాబ్‌తో పాటూ దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా క్రిమెనల్ కేసులు ఉన్నాయి. అంతేకాదు ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చడం వంటి కార్యకలాపాలు కూడా లఖ్బీర్ చేశాడు. ఇతను 2017లో దేశం విడిచి పారిపోయాడు. ప్రస్తుతం లఖ్బీర్ ఖలీస్థానీ గ్రూప్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సభ్యుడిగా ఉన్నాడు. ఇదే కాక ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్, గుపత్వంత్ సింగ్ పన్నూతో కూడా ఇతనికి సంబంధాలున్నాయి. వీటితో పాటూ గ్యాంగ్ స్టర్ హర్వీందర్ సింగ్ తో కూడా లఖ్బీర్ టచ్ లో ఉన్నాడని కేంద్ర హోంశాఖ తెలిపింది.

Also Read : 12 పాస్ అయ్యారా?అయితే మీకు గుడ్ న్యూస్…ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో భారీ రిక్రూట్ మెంట్..పూర్తి వివరాలివే..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు