Ganesh Nimajjanam 2023: అక్కడే గణేశ్ నిమజ్జనం చేసి తీరుతాం.. ప్రభుత్వానికి రాజాసింగ్ సంచలన వార్నింగ్ దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో వినాయకుడి విగ్రహాలుపెట్టి పూజలు నిర్వహిస్తున్నారు. మండపాల్లో గణనాధుడిని నిత్య అలంకరణలు చేస్తూ ఉదయం, సాయంత్రం పూజలు చేశారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 9 రోజులు గణపతి మండపాల్లో పూజలను అందుకున్న బుజ్జి గణపయ్య గంగమ్మతల్లి ఒడిలో చేరే సమయం దగ్గర పడింది. By Vijaya Nimma 26 Sep 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి హైదరాబాద్‌లోని వినాయక విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. హుస్సేన్ సాగర్‌తో పాటు నగరంలోని చెరువుల్లో పీవోపీ విగ్రహాల నిమజ్జనం వద్దని మరోసారి హైకోర్టు స్పష్టం చేసింది. కృత్రిమ కొలనుల్లోనే పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయాలని ఆదేశించింది. గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో గణేష్ నిమజ్జనంపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచనల వ్యాఖ్యలు చేశారు. హిందువులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం హిందువులపై దౌర్జన్యం చేస్తోందని ఆరోపించారు. గత కొన్నేళ్ళుగా హుస్సేన్ సాగర్‌లో డ్రైనేజ్ మురికి నీరు కలుస్తుందన్నారు. దానివల్ల హుస్సేన్ సాగర్ పొల్ల్యూట్ కావడం లేదా..? అని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే వైభవంగా జరుగుతూ వస్తున్నాయి. మహారాష్ట్ర తర్వాత గణేష్ ఉత్సవాలు తెలంగాణలో ఘనంగా జరుగుతాయని అన్నారు. కొంతమంది కావాలని గణేష్ నిమజ్జనం వల్ల హుస్సేన్ సాగర్ పొల్యూట్ అవుతుందని కోర్టులో పిటిషన్ వేశారని మండిపడ్డారు. కోర్టులో ప్రభుత్వ తరఫు న్యాయవాది సరైన రీతిలో వాదించలేకపోవడం వల్లే హైకోర్టు పీవోపీ వినాయకులను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయకూడదని తీర్పు చెప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. Your browser does not support the video tag. ఏం జరిగిన ప్రభుత్వానిదే బాధ్యత హుస్సేన్ సాగర్‌లో హైదరాబాద్ డ్రైనేజ్ ఎంత కలవడం లేదా ఫ్యాక్టరీల వ్యర్ధాలంతా హుస్సేన్ సాగర్‌లోకి రావడం లేదా కేసీఆర్ సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా హుస్సేన్ సాగర్‌ను మంచినీటి సరస్సుగా మారుస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటిదాకా ఎందుకు మార్చలేకపోయారు..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పొల్యూషన్ బోర్డ్ ఏం చేస్తుంది వినాయకుడిని నిమజ్జనం వల్ల హుస్సేన్ సాగర్ పొల్యూషన్ అవుతుంది అనే రిపోర్టు మీ దగ్గర ఉంటే జడ్జి ముందర ఎందుకు పెట్టలేదని ఫైర్ అయ్యారు. గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధమవుతున్న తరుణంలో హైకోర్టు ఇలాంటి తీర్పుని ఇవ్వడం వెనక ప్రభుత్వ వైఫల్యం ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం పీవోపీ గణేష్‌ల వల్ల హుస్సేన్ సాగర్ పొల్యూట్ కాదని జీవో ఇచ్చింది. ఆ జీవోను హైకోర్టు జడ్జి ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు..? అని ప్రశ్నించారు. ఎప్పటిలాగే గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఎవరైనా అడ్డుపడితే ఏమైనా జరిగితే దానికి ప్రభుత్వానిదే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గంగమ్మతల్లి ఒడిలోకి.. రెండు రోజుల్లో హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున నిమజ్జనం జరగనున్న తరుణంలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేసిన అధికారులు ఇలాంటి ఆదేశాలు ఇవ్వటంతో నిరసనలు కూడా మొదలయ్యాయి. సీపీతో పాటు, జీహెచ్ఎంసీ కమిషనర్‌ను తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అమలు చేసి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఇక దీంతో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధికారులు చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే.. హైదరాబాద్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం.. 74 మినీ చెరువులను ఏర్పాటు చేయగా..వాటిల్లో 22 భారీ పోర్టబుల్ వాటర్ ట్యాంకులు ఉన్నాయి. 23 ప్రాంతాల్లో కొలనులు, 27 ప్రదేశాల్లో బేబీ పాండ్స్ అందుబాటులో ఉంచారు. వాటిల్లోనే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయాలనేది హైకోర్టు ఆదేశాలు. #hyderabad #warning #brs-government #raja-singh #ganesh-nimajjanam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి