IPL Winner 2024: తెరపై ఒకరు తెరవెనక మరొకరు.. కేకేఆర్ విజయంలో వీరిద్దరిదే కీలకపాత్ర !

కోల్ కతా ఐపీఎల్ కప్ గెలుచుకోవడంలో టీమ్ మెంటార్ గంభీర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ కీలక పాత్ర పోషించారు. పదేళ్ల కల సాకారం చేయడంలో శ్రేయస్‌ అయ్యర్‌ మైదానంలో తన ప్రణాళికలను అమలుపరిస్తే.. తెర వెనక వ్యూహ రచన మాత్రం గంభీర్‌దే.

New Update
IPL Winner 2024: తెరపై ఒకరు తెరవెనక మరొకరు.. కేకేఆర్ విజయంలో వీరిద్దరిదే కీలకపాత్ర !

Kolkata Knight Riders: ఐపీఎల్‌ 2024 సీజన్ 17 ట్రోఫీని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సొంతం చేసుకుంది. మే 26న సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన తుది పోరులో ఘన విజయం సాధించి ముచ్చటగా మూడోసారి కప్ ను ముద్దాడింది. మొదటినుంచి ఆధిపత్యం చెలాయించిన కేకేఆర్ (KKR).. సన్ రైజర్స్ ను బ్యాటింగ్ లో కట్టడిచేయడంతోపాటు నిర్దేశించిన అత్యల్ప 113 స్కోర్ ను సునాయాసంగా చేధించింది. అయితే కేకేఆర్ విజయంలో మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir), కెప్టెన్ శ్రేయాస్ అయ్యారు కీలక పాత్ర పోషించారు. అయితే కెప్టెన్‌గా 2012, 2014 కోల్ కతాకు ట్రోఫీలను అందించిన గంభీర్‌ రాకతో జట్టు దశ మారిందంటున్న క్రికెట్ విశ్లేషకులు.. వీరిద్దరి కలయికపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అతడొచ్చిన తర్వాత జట్టు తీరు మారింది..
ఈ మేరకు కోల్ కతా కప్ గెలుచుకోవడంలో జట్టు మెంటార్‌ గౌతమ్ గంభీర్‌ది (Gautam Gambhir) కీలక పాత్ర ఉంది. కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ మైదానంలో తన ప్రణాళికలను అమలుపర్చినప్పటికీ.. తెర వెనక వ్యూహ రచన మాత్రం గంభీర్‌దే. అతడొచ్చిన తర్వాత జట్టు తీరే మారిపోయింది. ప్రతి మ్యాచ్‌లో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. పదేళ్ల కల సాకారంలో తనదైన బాధ్యతను నిర్వర్తించాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్.. గంభీర్ ది అద్భుతమైన బుర్ర. నరైన్‌ను ఓపెనర్‌గా పంపాలనే ఆలోచన ఆయనదే. అదే కోల్‌కతాకు అద్భుత ఫలితాలనిచ్చింది. నరైన్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. వేలంలోనూ గంభీర్.. స్టార్క్‌ను ఎంచుకోవడం చాలా గొప్ప నిర్ణయం. జట్టులో ఆటగాళ్లందరికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. మైదానంలోనే కాదు బయట కూడా ఆటగాళ్ల మధ్య రిలేషన్ పెంచాడు. అదే ఆ జట్టు విజయంలో కీలకమైంది. గంభీర్‌ వ్యూహాలు టోర్నీ మొత్తం ఎంతో ఉపయోగపడ్డాయంటూ పొగిడేశాడు.

ఇది కూడా చదవండి: Midday Meal: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. 5స్టార్ రేంజ్ లో మెనూ!

శ్రేయస్‌ అయ్యర్‌ సమర్థ నాయకుడు..
ఇక శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) సమర్థ నాయకుడు అనడంలో సందేహంలేదని భారత మాజీ ఆటగాడు కైఫ్ అన్నాడు. కానీ కెప్టెన్‌గా అతడికి రావాల్సినంత గుర్తింపు దక్కలేదన్నారు. గాయం కారణంగా గత ఐపీఎల్‌కు దూరమైనా.. ఈసారి జట్టును ముందుండి నడిపించాడు. శ్రేయస్‌కు మంచి భవిష్యత్ ఉందన్నాడు. ఇక గంభీర్‌ (Gautam Gambhir)సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్‌ వైరల్ అవుతోంది. 'ఎవరి ఆలోచనలు, చర్యలు నిజాయితిగా ఆధారపడి ఉంటాయో.. వారికి శ్రీకృష్ణుడే రథసారథి' అంటూ తాత్వికతతో కూడిన పోస్ట్‌ ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

గతంలో కెప్టెన్‌గా కోల్‌కతా ఫ్రాంచైజీకి గంభీర్‌ రెండు ట్రోఫీలను (2012, 2014) అందించారు. ఈసారి తిరిగి మెంటార్‌గా జట్టు గూటికి చేరారు. తద్వారా పదేళ్ల నిరీక్షణకు తెరదించారు. ఈ సందర్భంగా గెలుపులో గంభీర్‌ పాత్రను జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, వైస్‌ కెప్టెన్‌ నితీశ్‌ రాణా కొనియాడారు. మరో కేకేఆర్‌ స్టార్‌ ఆటగాడు రింకూ సింగ్‌ సైతం గంభీర్‌ పాత్రను కొనియాడాడు. తన ఏడేళ్ల కల నెరవేరిందంటూ మొత్తం టీమ్‌తో పాటు ప్రత్యేకంగా గంభీర్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు