G20 Summit: పెళ్లి కూతురిలా ముస్తాబైన ఢిల్లీ.. వైరల్‌గా మారిన ఫొటోలు, వీడియోలు..!

జీ20 సమ్మిట్‌కి దేశ రాజధాని అంగరంగ వైభవంగా ముస్తాబైంది. రేపు(సెప్టెంబర్ 09), ఎల్లుండి(10) ఢిల్లీలో జీ20 సమావేశాలు జరగనుండగా.. ప్రపంచదేశాల నుంచి అతిరథ మహారథులు వస్తున్నారు. దీంతో కుతుబ్ మినార్(Qutab Minar) నుంచి ఇతర చారిత్రక కట్టడాల వరకు దాదాపు అన్నిటికి లైట్‌ ఎఫెక్ట్స్‌ పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

New Update
G20 Summit: పెళ్లి కూతురిలా ముస్తాబైన ఢిల్లీ.. వైరల్‌గా మారిన ఫొటోలు, వీడియోలు..!

G20 Summit Delhi: ఢిల్లీ మొత్తం మారిపోయింది. పెళ్లి కూతురిలా ముస్తాబైంది. దేశ రాజధానిలో ఎక్కడ చూసినా అందమే కనిపిస్తోంది. కళ్ళు మిరుమిట్లు గొలిపే లైట్లు, డెకరేషన్‌.. ఇలా ఢిల్లీ క్లీన్‌గా కనిపిస్తోంది. జీ20 సమ్మిట్‌(G20 summit)కి వివిధ దేశాల నుంచి అతిథిలు వస్తుండడంతో యావత్ ప్రపంచం చూపు ఢిల్లీపైనే పడింది. రేపు(సెప్టెంబర్ 09), ఎల్లుండి(సెప్టెంబర్ 10) జీ20 సమావేశాలు జరగనుండగా.. ప్రపంచ దేశాధినేతలు ఇండియాకు రానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(biden), బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌(sunak), ఆస్ట్రేలియా ప్రధాని ఆంధోని ఆల్బనిస్‌, కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో, సౌదీ అరేబియా రాజు మొహ్మద్‌ బిన్‌ సల్మాన్‌, టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్‌ లాంటి ప్రముఖులు వస్తుండడంతో ఢిల్లీ మున్సిపల్‌ అధికారులు దేశరాజధానిని మరింత అందంగా మార్చారు. చారిత్రక కట్టడాలకు వేదికైన ఢిల్లీలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఢిల్లీకి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

ఢిల్లీలో ఈ మూడు రోజులు ఆంక్షలు:
జీ20 సమావేశాల కారణంగా ఢిల్లీలో పోలీసులు ఆంక్షలను అమలు చేస్తున్నారు. గూడ్స్ వాహనాలు, వాణిజ్య వాహనాలు, అంతర్ రాష్ట్ర బస్సులు, స్థానిక సిటీ బస్సులతో సహా వివిధ రకాల వాహనాలు మధుర రోడ్ (ఆశ్రమ చౌక్ దాటి), భైరాన్ రోడ్, పురానా క్విలా రోడ్, ప్రగతి మైదాన్ లోపల నడపడానికి అనుమతించరు. సెప్టెంబర్ 7 అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11:59 వరకు ఈ రూల్స్ పాటించాలి. పాలు, కూరగాయలు, పండ్లు, వైద్య సామాగ్రి లాంటి నిత్యావసర వస్తువులను రవాణా చేసే గూడ్స్ వాహనాలతో పాటు చెల్లుబాటు అయ్యే 'నో ఎంట్రీ పర్మిషన్స్'తో ఢిల్లీలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది. ఇక న్యూఢిల్లీ జిల్లాలోని మొత్తం ప్రాంతం సెప్టెంబర్ 8(ఇవాళ) ఉదయం 5 గంటల నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11:59 గంటల వరకు 'నియంత్రిత జోన్-I'గా గుర్తించారు. అయితే.. ఢిల్లీలో ఇప్పటికే ఉన్న బస్సులతో సహా అన్ని రకాల వాణిజ్య వాహనాలు రింగ్ రోడ్, రింగ్ రోడ్ దాటి ఢిల్లీ సరిహద్దుల వైపు రోడ్ నెట్‌వర్క్‌లో ప్రయాణించడానికి అనుమతిస్తున్నారు.

ALSO READ: ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు.. బైడెన్‌తో పాటు దేశానికి కొత్త అతిథి!

Advertisment
Advertisment
తాజా కథనాలు