IPL Auction: ఈ ఇద్దరి ఆస్ట్రేలియా తోపులను పట్టించుకోని ఫ్రాంచైజీలు.. అన్‌సోల్డ్‌ ఫుల్‌ లిస్ట్ ఇదే!

ఐపీఎల్‌-2024 ఆక్షన్‌లో పలువురు స్టార్‌ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏ జట్టు కూడా ఆసక్తి చూపలేదు. ఈ లిస్ట్‌లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు స్టీవెన్ స్మిత్ (బేస్ ధర రూ. 2 కోట్లు), జోష్ హేజిల్‌వుడ్ ఉన్నారు. అటు కివీస్‌ స్టార్‌ జేమ్స్ నీషమ్‌ కూడా అన్‌సోల్డ్‌ అయ్యాడు.

New Update
IPL Auction: ఈ ఇద్దరి ఆస్ట్రేలియా తోపులను పట్టించుకోని ఫ్రాంచైజీలు.. అన్‌సోల్డ్‌ ఫుల్‌ లిస్ట్ ఇదే!

ఐపీఎల్‌-2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం ఈ సారి రికార్డులు సృష్టించింది. ఊహించని విధంగా ఇద్దరు ఆటగాళ్లు ఏకంగా 20కోట్లకు పైగా పలకడం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. నిజానికి మినీ వేలంలో పర్సు లిమిట్‌ చాలా జట్లకు తక్కువే ఉంది. అయినా ఉన్నందంతా ఒక ప్లేయర్ కోసమే అన్నట్టు పలు జట్లు పోటి పడ్డాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్లేయర్లు జాక్‌పాట్ కొట్టారు. వరల్డ్‌కప్‌ విన్నింగ్ కెప్టెన్‌ కమ్మిన్స్‌ను రూ.20.50 కోట్లు పెట్టి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతం చేసుకుంటే ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ను ఏకంగా రూ.24.75 కోట్లు పెట్టి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సొంతం చేసుకుంది. ఇలా ఆస్ట్రేలియా ఆటగాళ్ల కోసం ఎగబడ్డారని భావించేలోపే ఇద్దరు కీలక ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం కాస్త షాక్‌కు గురి చేసింది. ఈ లిస్ట్‌లో స్టీవ్‌స్మీత్‌తో పాటు పేసర్‌ హెజల్‌వుడ్‌ కూడా ఉన్నాడు.

publive-image కొనుగోలు అవ్వని ఆటగాళ్లు

ఐపీఎల్‌లో మొత్తం అన్‌సోల్డ్‌ అయిన ప్లేయర్ల లిస్ట్‌పై ఓ లుక్కేయండి:

➼ కరుణ్ నాయర్ (ప్రాథమిక ధర రూ. 50 లక్షలు)
➼ స్టీవెన్ స్మిత్ (బేస్ ధర రూ. 2 కోట్లు)
➼ ఫిల్ సాల్ట్ (బేస్ ధర రూ. 1.5 కోట్లు)
➼ జోష్ ఇంగ్లిస్ (ప్రాథమిక ధర 2 కోట్లు)
➼ కుసాల్ మెండిస్ (బేస్ ధర రూ. 50 లక్షలు)
➼ జోష్ హేజిల్‌వుడ్ (ప్రాథమిక ధర రూ. 2 కోట్లు)
➼ ఆదిల్ రషీద్ (ప్రాథమిక ధర రూ. 2 కోట్లు)
➼ వకార్ సలాంఖీల్ (ప్రాథమిక ధర రూ. 50 లక్షలు)
➼ అకేల్ హోసేన్ (ప్రాథమిక ధర రూ. 50 లక్షలు)
➼ ఇష్ సోధి (ప్రాథమిక ధర రూ. 75 లక్షలు)
➼ తబ్రైజ్ షమ్సీ (ప్రాథమిక ధర రూ. 50 లక్షలు)
➼ రోహన్ కున్నుమ్మల్ (ప్రాథమిక ధర రూ. 20 లక్షలు)
➼ ప్రియాంష్ ఆర్య (ప్రాథమిక ధర రూ. 20 లక్షలు)
➼ మనన్ వోహ్రా (బేస్ ధర రూ. 20 లక్షలు)
➼ సర్ఫరాజ్ ఖాన్ (ప్రాథమిక ధర రూ. 20 లక్షలు)
➼ రాజ్ బావా (ప్రాథమిక ధర రూ. 20 లక్షలు)
➼ వివ్రంత్ శర్మ (ప్రాథమిక ధర రూ. 20 లక్షలు)
➼ అతిత్ షెత్ (ప్రాథమిక ధర రూ. 20 లక్షలు)
➼ హృతిక్ షోకీన్ (ప్రాథమిక ధర రూ. 20 లక్షలు)
➼ ఉర్విల్ పటేల్ (బేస్ ధర రూ. 20 లక్షలు)
➼ విష్ణు సోలంకి (ప్రాథమిక ధర రూ. 20 లక్షలు)
➼ కులదీప్ యాదవ్ (ప్రాథమిక ధర రూ. 20 లక్షలు)
➼ ఇషాన్ పోరెల్ (బేస్ ధర రూ. 20 లక్షలు)
➼ శివ సింగ్ (ప్రాథమిక ధర రూ. 20 లక్షలు)
➼ మురుగన్ అశ్విన్ (ప్రాథమిక ధర రూ. 20 లక్షలు)
➼ పుల్కిత్ నారంగ్ (ప్రాథమిక ధర రూ. 20 లక్షలు)
➼ ఫిన్ అలెన్ (ప్రాథమిక ధర రూ. 75 లక్షలు)
➼ కోలిన్ మున్రో (బేస్ ధర రూ. 1.5 కోట్లు)
➼ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (ప్రాథమిక ధర రూ. 2 కోట్లు)
➼ ఖైస్ అహ్మద్ (ప్రాథమిక ధర రూ. 50 లక్షలు)
➼ మైకేల్ బ్రేస్‌వెల్ (బేస్ ధర రూ. 1 కోటి)
➼ జేమ్స్ నీషమ్ (ప్రాథమిక ధర రూ. 1.5 కోట్లు)
➼ కీమో పాల్ (బేస్ ధర రూ. 75 లక్షలు)
➼ ఓడియన్ స్మిత్ (ప్రాథమిక ధర రూ. 50 లక్షలు)
➼ దుష్మంత చమీర (ప్రాథమిక ధర రూ. 50 లక్షలు)
➼ బెన్ ద్వార్షుయిస్ (ప్రాథమిక ధర రూ. 50 లక్షలు)
➼ మాట్ హెన్రీ (ప్రాథమిక ధర 75 లక్షలు)
➼ కైల్ జేమీసన్ (బేస్ ధర రూ. 1 కోటి)
➼ టైమల్ మిల్స్ (బేస్ ధర రూ. 1.5 కోట్లు)
➼ ఆడమ్ మిల్నే (బేస్ ధర రూ. 1 కోటి)
➼ లాన్స్ మోరిస్ (ప్రాథమిక ధర రూ. 75 లక్షలు)
➼ సందీప్ వారియర్ (ప్రాథమిక ధర రూ. 50 లక్షలు)
➼ ల్యూక్ వుడ్ (ప్రాథమిక ధర రూ. 50 లక్షలు)
➼ స్వస్తిక్ చికారా (ప్రాథమిక ధర రూ. 20 లక్షలు)
➼ రితిక్ ఈశ్వరన్ (ప్రాథమిక ధర రూ. 20 లక్షలు)
➼ హిమ్మత్ సింగ్ (ప్రాథమిక ధర రూ. 20 లక్షలు)
➼ శశాంక్ సింగ్ (ప్రాథమిక ధర రూ. 20 లక్షలు)
➼ సుమీత్ వర్మ (ప్రాథమిక ధర రూ. 20 లక్షలు)
➼ హర్ష్ దూబే (బేస్ ధర రూ. 20 లక్షలు)
➼ తనుష్ కోటియన్ (ప్రాథమిక ధర రూ. 20 లక్షలు)
➼ కమలేష్ నాగర్‌కోటి (ప్రాథమిక ధర రూ. 20 లక్షలు)
➼ ప్రదోష్ రంజన్ పాల్ (ప్రాథమిక ధర రూ. 20 లక్షలు)
➼ జి అజితేష్ (ప్రాథమిక ధర రూ. 20 లక్షలు)
➼ గౌరవ్ చౌదరి (ప్రాథమిక ధర రూ. 20 లక్షలు)
➼ బిపిన్ సౌరభ్ (ప్రాథమిక ధర 20 లక్షలు)
➼ KM ఆసిఫ్ (ప్రాథమిక ధర INR 20 లక్షలు)
➼ మహ్మద్ కైఫ్ (ప్రాథమిక ధర 20 లక్షలు)
➼ అభిలాష్ శెట్టి (ప్రాథమిక ధర 20 లక్షలు)
➼ గుర్జప్నీత్ సింగ్ (ప్రాథమిక ధర INR 20 లక్షలు)
➼ పృథ్వీ రాజ్ యర్రా (ప్రాథమిక ధర 20 లక్షలు)
➼ శుభమ్ అగర్వాల్ (ప్రాథమిక ధర 20 లక్షలు)
➼ కృష్ణన్ శ్రీజిత్ (ప్రాథమిక ధర 20 లక్షలు)

Also Read: రోహిత్‌ శర్మ జట్టులో కొనసాగుతాడా? తేల్చేసిన ముంబై హెడ్‌ కోచ్!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: విశాఖ వాసుల ఫోన్లలో పాకిస్తాన్ యాప్.. బయటపడ్డ షాకింగ్ విషయాలు!

పహల్గాం ఉగ్రదాడితో దేశమంతా హై అలర్ట్ నడుస్తోంది. తాజాగా విశాఖపట్నంలో లోన్‌ యాప్‌ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాకిస్థాన్ నుంచి యాప్ ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించగా రూ.200కోట్లు లావాదేవీలు నడుస్తున్నట్లు వెల్లడించారు. 9మందిని అరెస్ట్ చేశారు.

New Update
vishaka

Visakhapatnam Police arrest Pakistani loan app gang

Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా హై అలర్ట్ నడుస్తోంది. తాజాగా విశాఖపట్నంలో లోన్‌ యాప్‌ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాకిస్థాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించగా రూ.200 కోట్ల రూపాయల లావాదేవీలు నడుస్తున్నట్లు వెల్లడించారు. లోన్ యాప్‌ల ద్వారా పలు ముఠాలు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాయని ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్ కేసులో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. లోన్ యాప్‌లో రూ.2 వేల రూపాయలు అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడిని ద్వారా ఈ కేసు చేధించినట్లు పేర్కొన్నారు. 

భార్య ఫొటోలు మార్ఫింగ్ చేసి..

'నరేంద్ర అనే యువకుడి భార్య ఫోటోలను సైబర్ నేరగాళ్లు మార్ఫింగ్ చేశారు. ఫ్రెండ్స్, బంధువులకు పంపించారు. అవమానం తట్టుకోలేక 40 రోజులకే నరేంద్ర సూసైడ్ చేసుకున్నాడు. ఈ దందా పాకిస్థాన్‌ కేంద్రంగా నడుస్తోంది. దాదాపు ఇండియానుంచి 9 వేల మంది మోసపోయారు. నిందితులనుంచి 18 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, 54 సిమ్‌ కార్డులు, రూ.60 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. 

Also Read :  జాగ్రత్తగా చూసుకున్నాడు...మా బంధానికి పేరు పెట్టలేను...సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

మరోవైపు విశాఖతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పాక్ పౌరులను గుర్తించి తమ దేశానికి పంపిస్తున్నారు. ఆధార్ కార్డు, పోస్ పోర్ట్, తదితర వివరాల ఆధారంగా తనిఖీలు చేపడతున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో పిల్లలతో సహా 1026 మంది పాకిస్తాన్ వాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  

Also Read :  భద్రతా బలగాలకు మావోయిస్టు అగ్రనేత లేఖ

loan app | vishakapatnam | today telugu news

Advertisment
Advertisment
Advertisment