Telangana Farmers: రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఫ్రీగా సోలార్ పంపుసెట్లు! తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రైతులకు ఫ్రీగా సోలార్ పంపుసెట్లు ఇచ్చేలా ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. నాణ్యమైన విద్యుత్ అందుబాటులో ఉండేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. By Manogna alamuru 04 Sep 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth Reddy: రాబోయే రోజుల్లో ఒక బిజినెస్ హబ్‌గా మారబోతున్న తెలంగాణలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విద్యుత్ అందుబాటులో ఉండేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారితో కలిసి విద్యుత్ శాఖపై ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. రాష్ట్రంలో విద్యుత్ రంగం, ప్రజల అవసరాలకు అనుగుణంగా తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి చేసేందుకు వీలుగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరిగేలా చర్యలు తీసుకోవాలి. వివిధ శాఖల పరిధిలో నిరుపయోగంగా ఉన్న భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించడానికి రైతులకు ఉచితంగా సోలార్ పంప్‌సెట్లను అందిస్తారని చెబుతున్నారు.అందుకు కొండారెడ్డిపల్లెలో పైలట్ ప్రాజెక్టు మొదలుపెట్టనున్నారు. వీటితో పాటూ వంటగ్యాస్ బదులుగా సోలార్ విద్యుత్ వినియోగ విధానం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీని కోసం మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే అటవీ భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోనున్నారు. వీటిన్నింటకీ అనుగుణంగా ప్రతీ ఏటా 40వేల మెగావాట్స్ విద్యుత్ అందుబాటులో ఉండే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన ఆదేశాలను ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి ఇప్పటికే జారీ చేశారు. ఓవర్ లోడ్ సమస్యకు శాశ్వత పరిష్కారంతో పాటూ అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. Also Read: 10 రోజుల్లో సమస్యల పరిష్కరిస్తాం–సీఎం చంద్రబాబు #telangana #cm-revanth-reddy #formers #solar-pump-sets మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి