Elections 2024: ప్రచారాలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..ఇక నాలుగురోజులే

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం పీక్స్‌కు చేరుకుంది. ప్రచారానికి అనుమతి ఇంకా నాలుగు రోజుల్లో ముగియనుండడంతో నేతలు అందరూ పరుగులుపెడుతున్నారు. ప్రధాని మోదీతో సహా అందరూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

New Update
Elections 2024: ప్రచారాలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..ఇక నాలుగురోజులే

Election Campaigning In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో మే 13న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ రెండింటికీ జరగనుండగా...తెలంగాణలో మాత్రం కేవలం లోక్‌సభకు మాత్రమే పోలింగ్ జరగనుంది. ఈసీ నిబంధనల ప్రకారం పోలింగ్‌కు రెండు రోజుల ముందే ఎన్నికల ప్రచారాన్ని నిలిపేయాలి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్ఓల ఎన్నికల ప్రచారానికి ఇంక నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో నేతలు అందరూ హడావుడి పడుతున్నారు. ప్రధాని మోదీ నుంచి కేంద్రమంత్రి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) , ఏపీ సీఎం జగన్ (AP CM Jagan), చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్...ఇతర ముఖ్య నేతలు అందరూ రెండు తెలుగు రాష్ట్రాలనూ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.

సుడిగాలి పర్యటనలు..

రెండు తెలుగు రాష్ట్రాలనూ ప్రధాని మోదీ (PM Modi) చుట్టేస్తున్నారు. ఈరోజు ఉదయం తెలంగానలో రెండు సభల్లో పాల్గొన్న ప్రధాని రాత్రి 7 గంటలకు విజయవాడ బందర్ రోడ్డు షోలో పాల్గొననున్నారు. ఇందులో ప్రధానితో పాటు చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్లు (Pawan Kalyan) కూడా పాల్గొంటారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రోజుకు మూడు ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈరోజు రేవంత్ నిజామాబాద్‌ జిల్లాలో భారీ బహిరంగ సభలో మాట్లాడనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు కూడా జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడుతున్నారు.

ఇక తెలంగాణ మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ (KCR) బస్సు యాత్రలతో గులాబీ శ్రేణులలో జోష్‌ పెంచుతున్నారు. వరుసగా జిల్లాలను చుట్టేస్తూ రోడ్‌ షోలలో ప్రసంగిస్తున్నారు. వీరికి తోడు ఢిల్లీ అగ్రనేతలు కూడా తెలుగు రాష్ట్రాల్లో వాలిపోయారు. కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలు కూడా జిల్లాలను చుట్టేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు వరుస కడుతున్నారు. అగ్రనేతలు ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో పర్యటించి ప్రచారం చేశారు. రేపు హోంమంత్రి అమిత్ షా భువనగిరి బహిరంగ సభలో పాల్గొంటారు.

Also Read:Telangana: RRR మూవీ కలెక్షన్లను దాటిన RR ట్యాక్స్.. రేవంత్ సర్కార్ పై మోదీ ఎటాక్

Advertisment
Advertisment
తాజా కథనాలు