Formula E-Race:సారీ హైదరాబాదీస్..ఫార్ములా ఈ రేస్ రద్దు ఫార్ములా రేస్ అభిమానులకు పెద్ద షాక్. హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ ను రద్దు చేస్తున్నామని నిర్వాహకులు ప్రకటించారు. ప్రభుత్వం స్పందిచకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. By Manogna alamuru 06 Jan 2024 in ఇంటర్నేషనల్ తెలంగాణ New Update షేర్ చేయండి Formula E Race: ఫిబ్రవర్ 10న హైదరాబాద్‌లో(Hyderabad) జరగాల్సిన ఫార్ములా ఈ రేస్‌ను రద్దు చేస్తున్నామని ఫార్ములా ఈ రేస్(Formula E Race) ఆపరేషన్స్ ప్రకటించింది. ఈ-రేస్ సీజన్ 10కు చెందిన నాలగవ రౌండ్ ఇక్కడ జరగాల్సి ఉంది. అయితే ఈ రేస్ గురించి తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) స్పందిచలేదని...దానికి తోడు మున్సిపల్ శాఖ(GHMC), హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 30వ తేదీ జరగిన ఒప్పందాన్ని మున్సిపల్ శాఖ ఉల్లంఘించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దాంతో పాటూ మున్సిపల్ శాఖకు నోటీసులు కూడా జారీ చేశామని చెబుతున్నారు. హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎఫ్ఈవో చెబుతోంది. We have announced an update to the Season 10 calendar, with the cancellation of the Hyderabad E-Prix, scheduled for Saturday 10th February. — Formula E (@FIAFormulaE) January 5, 2024 Also read:టచ్ చేస్తే మాజిక్‌లా మ్యూజిక్.. ఏఆర్ రహమాన్ బర్త్‌డే ఈరోజు గత తెలంగాణ సర్కార్, ఫార్ములా ఈ మధ్య ఈరేస్ ఒప్పందం జరిగింది. కానీ ప్రస్తుతం తెలంగాణ సర్కార్ ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేసింది. సీజన్ 10 రేస్‌లు జరగనున్న నగరాల్లో టోక్యో, షాంఘై, బెర్లిన్, మొనాకో, లండన్ నగరాలు ఉన్నాయి. జనవరి 13వ తేదీ నుంచి ఈ సీజన్ ప్రారంభంకానుంది. తెలంగాణలో ఫార్ములా రేస్ కాన్సిల్ అవడం చాలా నిరాశపరిచిందని అంటున్నారు ఫార్ములా ఈ ఛీఫ్ ఆఫీసర్ అల్బర్టో లాంగో. ఈ రేస్ నిర్వించడం వలన హైదరాబాద్‌కు చాలా కీకలమైనది అని ఆయన వ్యాఖ్యానించారు. మోటార్ స్పోర్ట్స్ అభిమానులకు ఇది పెద్ద డిసప్పాయింట్ అని అన్నారు. గతేడాది జరిగిన రేస్.. దేశంలోనే మొదటి సారిగా లాస్ట్ ఇయర్ జనవరిలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఇ కార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ (Racing)జరిగింది. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా… హుస్సేన్ సాగర్ తీరం (Hussain Sagar) వెంబడి రేసింగ్ కార్లు పరుగులు పెట్టాయి. మన దేశంలో తొలిసారిగా జరిగిన ఈ ఇంటర్నేషనల్ ఫార్ములా – రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ను చూసేందుకు పలువురు క్రీడా, సినీ, వ్యాపార ప్రముఖులు హైదరాబాద్ నగరానిలో క్యూ కట్టారు. క్రికెట్ దిగ్గజం సచిన్(Sachin Tendulkar), రామ్‌చరణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. లాస్ట్ ఇయర్ జరిగిన ప్రారంభోత్సవ రేస్ చాలా సక్సెస్ అయ్యిందని, ఆ రేస్ వల్ల ఆ ప్రాంతంలో సుమారు 84 మిలియన్ల డాలర్ల ఆర్థిక ప్రగతి జరిగిందని ఫార్ములా ఈ సీఈవో జెఫ్ డోడ్స్ తెలిపారు. #telangana #hyderabad #government #fromula-e-race మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి