రాజకీయ నాయకుడి కొడుకుకే ఆసుపత్రిలో బెడ్‌ లేదు..ఇక సామాన్యుల సంగతేంటి?

దవాఖానాలో బెడ్‌ లేక ఉత్తర్‌ ప్రదేశ్‌ లఖ్‌నవూకు చెందిన బీజేపీకి చెందిన మాజీ ఎంపీ బైరోన్‌ ప్రసాద్‌ మిశ్రా కుమారుడు ప్రకాశ్‌ మిశ్రా మృతి చెందాడు. దీంతో ఆయన మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మాజీ ఎంపీతో పాటు ఆయన బంధువులు ఆసుపత్రిలో నిరసనకు దిగారు. దీని గురించి విచారణ చేపడతామని ఆసుపత్రి అధికారులు తెలిపారు.

New Update
రాజకీయ నాయకుడి కొడుకుకే ఆసుపత్రిలో బెడ్‌ లేదు..ఇక సామాన్యుల సంగతేంటి?

ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క ఎందరో సామాన్యులు ప్రాణాలు విడిచిన ఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉంటున్నాం. కానీ ఇక్కడ ఓ రాజకీయ నాయకుని కుమారుడు కూడా ఆసుపత్రిలో బెడ్‌ ఖాళీ లేక ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని లఖ్‌నవూలో జరిగింది. బీజేపీకి చెందిన మాజీ ఎంపీ బైరోన్‌ ప్రసాద్‌ మిశ్రా కుమారుడు ప్రకాశ్‌ మిశ్రా.

ప్రకాశ్‌ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని నగరంలోని సంజయ్‌ గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ప్రకాశ్‌ కండీషన్‌ సీరియస్‌ గా ఉండడంతో ఆయన్ని ఐసీయూకి తరలించాలని వైద్యులు సూచించారు.

Also read: ‘డ్రామారావు.. గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార’.. మొండి కత్తి డ్రామా!

కానీ అప్పటికే ఆసుపత్రిలో ఉన్న ఐసీయూ బెడ్లు అన్ని కూడా రోగులతో నిండిపోయాయి. దీంతో డాక్టర్లు ఆయనకు వైద్యం కూడా అందించలేదు. ఈ క్రమంలోనే ప్రకాశ్‌ మరణించాడు. దీంతో ఆగ్రహించిన మాజీ ఎంపీ..వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు చనిపోయాడని ఆరోపిస్తూ హాస్పిటల్ లోనే నిరసనకు దిగారు.

ఆయనతో పాటు మృతుడి బంధువులు కూడా హాస్పిటల్‌ లో ధర్నాకు దిగారు. దీంతో ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్ ఆర్కే ధీమాన్‌ ఆదివారం తెల్లవారు జామున ఆసుపత్రికి వచ్చారు. రావడంతోనే జరిగిన సంఘటన గురించి ఆరాతీశారు. ఆయన మాజీ ఎంపీ వద్దకు వెళ్లి నిరసన విరమించాలని నచ్చజెప్పారు.

Also read: ఉదయాన్నే సిగరేట్ తాగే అలవాటు ఉందా? అయితే ఈ రోగాలు గ్యారెంటీ..!!

వెంటనే ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా బాధ్యుల పై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన వెల్లండిచారు. దీంతో మాజీ ఎంపీ శాంతించి కుమారుడి మృతదేహాన్ని తీసుకుని ఇంటికి వెళ్లారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రకాశ్‌ చనిపోయినట్లు బంధువులు ఆరోపిస్తుంటే..వైద్యులు మాత్రం ఆయన ఆసుపత్రికి వచ్చే సరికే ఆయన పరిస్థితి చాలా సీరియస్‌ గా ఉందని..ఆ సమయంలోనే హాస్పిటల్‌ ఎమర్జెన్సీ బెడ్లు కూడా అన్ని నిండి పోవడంతో మేము ఏం చేయాలేకపోయామని వివరించారు.

ఒక రాజకీయ నాయకుని కుమారుని విషయంలోనే వైద్యులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే ..ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !

విశాఖలో గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో వివాహం చేసుకున్నారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తేలింది

New Update

AP Crime: విశాఖలో గర్భిణీ అనూషను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిందితుడు హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణ ప్రకారం.. పీఎం పాలెం పీఎస్‌ పరిధిలో గర్భిణీ అనూష హత్య ఘటనలో ఏసీపీ అప్పలరాజు సంచలన విషయాలు తెలిపారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తెలింది. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్ పలు నాటకాలు ఆడిన్నారు. ముందు తనకు క్యాన్సర్ ఉందని, వేరే పెళ్లి చేసుకోవాలని అనూషపై జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేశాడు.

గతంలో చంపడానికి ప్లాన్..

ఆమె అంగీకరించకపోవడంతో మరో నాటకం ఆడాడు. తనకు పెళ్లైనట్లు తల్లిదండ్రులకు తెలియదని, వారికి తెలిస్తే ఇద్దరినీ చంపేస్తారని అనూషకు చెప్పాడు. అందుకే.. విడాకులు తీసుకుందామని ఒత్తిడి చేశాడు. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో అనూషను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. జ్ఞానేశ్వర్ భార్యను బయటకు తీసుకువెళ్లినా సరదాగా మెలిగేవాడు కాదని, జంటగా ఫొటోలు దిగుదామన్నా వద్దనేవాడు స్నేహితులు చెబుతున్నారు. గతంలో పలుమార్లు చంపడానికి ప్రయత్నించాడు. ఫలుదాలో టాబ్లెట్స్ కలిపి చంపాలని ఫ్లాన్‌ చేశాడు. జ్ఞానేశ్వర్ డెలివరీ ఉందని ఫ్రెండ్స్‌ అందరికీ వీడియో కాల్‌ చేశాడు.
 
ఇది కూడా చదవండి: రోజూ ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగితే ఇవే లాభాలు

రాత్రికి రాత్రి అనూషను చున్నీతో చంపేశాడు. జ్ఞానేశ్వర్ ముఖంపై గోర్లతో రెక్కేసిన ఆనవాలు ఉన్నట్లు బాధితురాలి స్నేహితులు పోలీసుల విచారణలో తెలిపారు. అయితే.. మంగళవారం డెలివరీ ఉండగా.. సోమవారం రాత్రే ఆమెను హతమార్చాడు. ఏమీ తెలియనట్లు మళ్లీ పడుకున్నాడు. ఉదయం బంధువులు లేపినా.. అనూష లేవలేదు. వారితోపాటే అతనూ నిద్ర లేపుతున్నట్లు నటించాడు. దీంతో జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామని.. తనను అనుమానించడంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఏసీపీ అప్పలరాజు తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడిపై హత్య నేరం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.   

ఇది కూడా చదవండి: క్లీన్ షేవ్, గడ్డం.. చర్మానికి ఏది మంచిదో తెలుసా?

( AP Crime | ap-crime-news | ap-crime-report | ap crime updates | ap crime latest updates )

Advertisment
Advertisment
Advertisment