Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఈ ఏడాదిలోనే అతిపెద్ద ఆఫర్ల జాతర.. డిస్కౌంట్ల వివరాలివే!

ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ లో ఏకంగా 85 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని తెలిపింది. అయితే.. సేల్స్ తేదీలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.

New Update
Flipkart: బిగ్ బిలియన్ డేస్ వచ్చేస్తున్నాయోచ్....ఆఫర్ల పండగే ఇంక

దేశంలో పండుగ సీజన్ మొదలైంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా గణేశ్ నవరాత్రుల ఉత్సవాల సందడే కనిపిస్తోంది. ఈ వేడుకలు ముగిసిన తర్వాత వరుసగా దేవీ నవరాత్రులు, దసరా, దీపావళి తదితర పండుగలు రానున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రముఖ సంస్థలు వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఆర్టీసీ, ఇతర ట్రావెల్స్ సంస్థలు సైతం పండుగ సీజన్లో ప్రయాణాలు చేసే వారికి ముందస్తు టికెట్ బుకింగ్ పై ఆఫర్లు ఇస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఆఫర్ల జాతరను ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ను (Flipkart Big Billion Days Sale) నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ సేల్ లో వివిధ వస్తువులపై ఈ ఏడాదిలోనే అతి తక్కువ ధరలు ఉంటాయని ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. సేల్ లో ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై (Smartphones) అదిరే ఆఫర్లు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తన సేల్స్ పేజీలో పేర్కొంది.

ల్యాప్ టాప్ లు, స్మార్ట్ వాచ్ లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు, యాక్ససరీలపై ఏకంగా 50-80 శాతం డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. స్మార్ట్ టీవీలు, వాషింగ్ మిషన్లను కొనాలని మీరు ప్లాన్ చేస్తూ ఉంటే.. ఈ సేల్ మీకు సూపర్ ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ లో ఈ వస్తువులపై 80 శాతం వరకు తగ్గింపులు ఉండనున్నాయి.

ఏసీలను కేవలం.. రూ.21,999 ప్రారంభ ధరతో సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తన సేల్స్ పేజీలో పేర్కొంది. ఇంకా.. ఫ్యాషన్ వస్తువులపై 60-90 శాతం వరకు తగ్గింపులు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఇంటి అలంకరణ వస్తువులు, కిచెన్ లో ఉపయోగించే పరికరాలపై భారీ తగ్గింపులు ఉండనున్నాయి. ఇంకా సోఫా తదితర ఫర్నీచర్ వస్తువులపై 85 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ ను ఈ నెల 6 తర్వాత ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి:
TSRTC Dasara Offer: దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. 10 శాతం డిస్కౌంట్.. ఇలా బుక్ చేసుకోండి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Amazon Great Summer Sale: అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ మే 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందు నుంచే సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సమ్మర్ సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లను ఇవ్వనుంది.

New Update
Amazon great summer sale

Amazon great summer sale

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ను ప్రకటించింది. వచ్చే నెల మే 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సమ్మర్ సేల్ ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందు నుంచే సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సమ్మర్ సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లను ఇవ్వనుంది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

5 శాతం వరకు డిస్కౌంట్..

ఈ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమర్లుకు 10 శాతం డిస్కౌంట్‌ కూడా ఇస్తోంది. దీంతో పాటు క్రెడిట్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై కూడా డిస్కౌంట్‌ లభించనుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుదారులకు అయితే 5 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. వీటితో పాటు క్యాష్‌బ్యాక్‌, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్స్‌, నో-కాస్ట్‌ ఈఎంఐ వంటివి కూడా ఈ సేల్ ద్వారా ఉన్నాయి.

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో భాగంగా.. కొన్ని స్మార్ట్‌ఫోన్లపై భారీగా డిస్కౌంట్‌లను ఇవ్వనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 అల్ట్రా, ఐక్యూ నియో 10R, ఐఫోన్ 15, వన్ ప్లస్ నోర్డ్ సీఈ4 లైట్, వన్ ప్లస్ 13ఆర్,  గెలాక్సీ ఎమ్ 35 5జీ, వన్ ప్లస్ నోర్డ్ 4, ఐక్యూ జెడ్ 10ఎక్స్ మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్‌ ఇవ్వనుంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

వీటితో పాటు ల్యాప్‌టాప్‌లపై కూడా ఆఫర్లను ప్రకటించనుంది. హెచ్‌పీ, లెనోవా వంటి వాటిపై కూడా ఆఫర్లు ఇవ్వనుంది. వీటితో పాటు స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు ఇతర వాటిపై కూడా ఆఫర్లు ఇవ్వనుంది. పొందగలుగుతారు, దీని వలన మీ కొనుగోళ్లు మరింత సరసమైనవిగా మారుతాయి.

 

mobiles | amazon-great-summer-sale | discounts | laptops

Advertisment
Advertisment
Advertisment