France Flight : హమ్మయ్య ఫ్రాన్స్ నుంచి వాళ్ళు వచ్చేశారు..25 మంది మాత్రం ఇంకా అక్కడే

ఫ్రాన్స్ లో చిక్కుకున్న భారతీయులు ఎట్టకేలకు ఇండియా చేరుకున్నారు. మానవ అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్న రుమేనియా విమానం ఈరోజు తెల్లవారు ఝామున మంబై ఎయిర్ పోర్టుకు చేరుకుంది. మొత్తం ప్రయాణికుల్లో 25 మంది తప్ప అందరూ స్వదేశానికి చేరుకున్నారు.

New Update
France Flight : హమ్మయ్య ఫ్రాన్స్ నుంచి వాళ్ళు వచ్చేశారు..25 మంది మాత్రం ఇంకా అక్కడే

France - India : సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. నాలుగు రోజులుగా ఫ్రాన్స్(France) లో చిక్కుకున్న భారతీయులు(Indians) ఈరోజు ఇండియాకు చేరుకున్నారు. మనుషులను అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ కొన్ని రోజుల క్రితం రొమేనియన్ ఎయిర్ సర్వీసెస్(RAS Romanian Airport Services) కు సంబంధించిన విమానాన్ని ఫ్రాన్ లో ఆపేశారు. ఇన్ని రోజులుగా భారతీయులు అక్కడే ఉన్నారు. ఇప్పుడు నాలుగు రోజుల విచారణ తర్వాత క్లియరెన్స్ లభించడంతో 276 మంది ప్రయాణికులు ఈరోజు తెల్లవారుఝామున ముంబైకి చేరుకున్నారు. అయితే ఇంకా 25 మంది మాత్రం ఫ్రాన్స్ లోనే ఉండిపోయారు. ఇందులో 20 మంది పెద్దవాళ్ళు, 5గురు పిల్లలు ఉన్నారు. వీళ్ళ పౌరసత్వ గుర్తింపు తేలకపోవడంతో పంపలేదని అధికారులు చెబుతున్నారు. వీళ్ళను శరణార్ధులుగా పరిగణమిస్తామని..ఫ్రాన్స్ చట్టాల ప్రకారం వాళ్ళని వెనక్కు పంపడం కుదరదని తెలిపారు.

Also Read:లేహ్ లడఖ్ లో భూకంపం..కదిలిన కొండలు

రొమేనియా విమానంలో మొత్తం 303మంది భారతీయులు ఇండియాకు వస్తున్నారు. ఇందులో 11 మంది మైనర్లు ఎవరి సహాయం లేకుండా వస్తున్నారు. వీళ్ళల్లో 6గురిని వెనక్కు పంపించేశారు కానీ 5గురిని మాత్రం అక్కడే ఉంచేశారు. వీళ్ళను తరలిస్తున్న ఇద్దరు ఏజెన్సీ వ్యక్తులను కూడా ఫ్రాన్స్ ఎయిర్ పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ ప్రధాన నిందితులుగా గుర్తించారు. దీని మీద అధికారికంగా మాత్రం ఇరుదేశాల నుంచి ప్రకటన రాలేదు.

రుమేనియాకు చెందిన లెజెండ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం గురువారం దుబాయి(Dubai) నుంచి నికరాగ్వాకు వెళుతూ మార్గమధ్యంలో ఫ్రాన్స్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇంధనం కోసం వాట్రీ విమానాశ్రయంలో దింపినప్పుడు ఫ్రాన్స్‌ అధికారులు విమానాన్ని అదుపులోకి తీసుకున్నారు. మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న అనుమానంతో అధికారులు విమానాన్ని ఎయిర్‌పోర్టులోనే నిలువరించారు. నికరాగ్వా నుంచి అమెరికాకు అక్రమ వలసలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాన్స్ అధికారులు విమానంలోని భారతీయులను నాలుగు రోజుల పాటు విచారించారు. ఈ క్రమంలో కొందరు ఫ్రాన్స్‌ ఆశ్రయం కోరగా మిగతా వారు భారత్‌లో దిగారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Taliban Government : పహల్గాంలో ఉగ్రదాడి.. తాలిబన్ల సంచలన ప్రకటన!

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి సంఘటనపై దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా ఖండించారు. తాలిబన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా ఖండించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేసింది.

New Update
Taliban's

Taliban's

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఇప్పటివరకు 28 మంది మరణించారు. ఈ సంఘటనను దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా ఖండించారు. తాలిబన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా ఈ భయంకరమైన సంఘటనపై స్పందించి ఖండించింది.


'జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దాడిని IEA విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండిస్తోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తోంది. ఇటువంటి చర్యలు దేశభద్రతను దెబ్బతీస్తాయి' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ ఖహర్ బాల్ఖీ బుధవారం ఎక్స్ వేదికగా ఒక ప్రకటనలో తెలిపారు. అటు పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని బంగ్లాదేశ్ తీవ్రంగా ఖండించింది అని దాడి జరిగిన దాదాపు 24 గంటల తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది.

Also Read :  Vinay Narwal : ఈమెకు ఏం చెప్పి ఓదార్చుదాం..  కన్నీళ్లు పెట్టిస్తున్న హిమాన్షి వీడియో!

ప్రపంచం ఆశ్చర్యపోయేలా జవాబు ఇస్తాం

భారత్ ను ఎవరూ భయపెట్టలేరని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.  త్రివిధ దళాధిపతులతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  ప్రపంచం ఆశ్చర్యపోయేలా జవాబు ఇస్తామని అన్నారు.  పహల్గాం దాడికి అతి త్వరలో ప్రతీకారం  తీర్చుకుంటామని.. ఒక్క దోషిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఎక్కడ నక్కిన కూడా పట్టుకుంటామని హామీ ఇచ్చారు.  ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేదే భారత్ నినాదమని తెలిపారు.  ఉగ్రవాదులు పిరికిపంద చర్యకు పాల్పడ్డారన్న రాజ్ నాథ్ సింగ్...  ఈ చర్యకు పాల్పడిన వారిని మాత్రమే కాకుండా, తెరవెనుక ఉన్న వారిని కూడా వదిలిపెట్టబోమన్నారు.  తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు రాజ్ నాథ్ సింగ్.

Also Read :  BCCI సంచలన నిర్ణయం..ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్లు ఇక ఉండవు?

Advertisment
Advertisment
Advertisment