Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురు దుర్మరణం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి వేగంగా వస్తున్న లారీ వెనకనుంచి ఓ కారును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన అయిదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. By B Aravind 29 Jan 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మితిమీరిన వేగంతో వచ్చిన గుర్తుతెలియని లారీ.. అదుపుతప్పి బొల్తాపడిన కారును వెనకనుంచి ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న రెండు కుటుంబాల్లో అయిదుగురు మృతి చెందారు. మృతులు మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. చెరుపల్లి మహేశ్, ఆయన భార్య జ్యోతి, కుమార్తె రిషిత, మహేశ్ తోడల్లుడు, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నెపల్లికి చెందిన భూమా మహేందర్, ఆయన కుమారుడు లియాన్సీ అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలిపారు. Also Read: బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి.. భూమా మహేందర్ భార్య మాధవి తీవ్రంగా గాయాలపాలయ్యారు. ముందుగా ఆమెను మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించగా.. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జనుజ్జయింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న రెండో పట్టణ ఎస్సై కృష్ణయ్య కేసు దర్యాపు చేపట్టారు. కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన లారీ ఆచూకీ కోసం ప్రస్తుతం పోలీసులు వెతుకుతున్నారు. ఏం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే... మహేశ్, మహేందర్ కుటుంబాలు ఈనెల 26న కారులో విజయవాడ దగ్గర్లో ఉన్న మోపిదేవి దైవ దర్శనానికి వెళ్లారు. ఆదివారం తిరుగు పయనమయ్యారు. కారు మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి వచ్చేసరికి రాత్రి అయ్యింది. వాళ్ల ఇంటికి ఇంకో 2 కోలోమీటర్లు మాత్రమే దూరం ఉంది. మూడు, నాలుగు నిమిషాల్లో ఇంటికి వెళ్లేవారు. కానీ అంతలోనే మృత్యువు లారీ రూపంలో ముంచుకొచ్చింది. కారు అదుపు తప్పి బోల్తా పడిపోయింది. దీంతో ఆ మార్గంలో వేగంగా వస్తున్న లారీ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమదంలో అయిదుగురు మృతి చెందడంతో రెండు కుటుంబాల బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. #road-accident #crime-news #miryalaguda #nalgonda-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి