Andhra Pradesh : కాకినాడ ఉప్పాడ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. మత్స్యకారుల ఆందోళన

కాకినాడ జిల్లాలో ఉప్పాడ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరబిందో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. తమ కంపెనీ కోసం అరబిందో సముద్రంలో పైన్‌లైన్ వేసింది. దీన్ని వెంటనే తొలగించాలంటూ మత్స్యకారులు ధర్నా చేస్తున్నారు.

New Update
Andhra Pradesh : కాకినాడ ఉప్పాడ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. మత్స్యకారుల ఆందోళన

Fisherman Dharna : కాకినాడ(Kakinada) లో మత్స్యకారులు(Fisherman) మహోగ్రరూపం చూపిస్తున్నారు. ఉప్పాడ దగ్గర ఉన్న అరబిందో ఫార్మసీ కంపెనీ(Aurobindo Pharmacy Company) కి వ్యతిరేకంగా ఆందోళనలను నిర్వహిస్తున్నారు. దీంతో యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటలో టెన్షన్‌ నెలకొంది. తమ బోట్లకు నిప్పంటించి మరీ మత్స్యకారులు నిరసన తెలుపుతున్నారు. సముద్రంలో వేసిన అరబిందో పైప్‌లైన్‌ను వెంటనే తొలగించాలంటూ ధర్నా చేస్తున్నారు. మూడు రోజులు నుంచి ఆందోళన చేస్తున్నా..అధికారులు పట్టించుకోవడం లేదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈరోజు పెద్దయెత్తున ఆందోళనకు దిగారు. అరబిందో పైప్‌లైన్ తీయకపోతే మత్స్య సంపద కనుమరుగు అవుతుందని వారు అంటున్నారు. వెంటనే పైప్‌లైన్ తొలగించాలని కొంతమంది మత్స్యకారులు ఒంటి మీద కిరోసిన్ పోసుకున్నారు.

రంగంలోకి పోలీసులు..

మత్స్యకారుల ఆందోళనతో ఉప్పాడ(Uppada) గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోట్లు తగలెట్టడం, ఒంటి మీద కిరోసిన్ పోసుకోవడం వటంఇవి చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకుండా చ్యలు తీసుకుంటున్నారు. మత్స్యకారులను అదుపు చేసేందుకు పోలీసు బలగాలను దించారు. బ్యానర్లతో పెద్ద సంఖ్యలో చేరుకున్న మత్స్యకారులు ఆదంఓళన చేస్తున్నారు.

మత్స్య సంపద కనుమరుగు...

అరబిందో ఉప్పాడ దగ్గర సముద్రంలోకి పైప్‌లైన్లను వేసింది. తన కంపెనీ నుంచి వచ్చే వ్యర్ధ పదార్ధాలను ఈ పైన్‌ లైన్ల ద్వారా సముద్రంలోకి పంపిస్తోంది. వీటివలన సముద్రంలో నీరు అంతా కలుషితమయిపోతోంది. దీంతో అక్కడ సముద్రంలో ఉన్న చేపలు చచ్చిపోతున్నాయి. మత్స్య సంపద కనుమరుగు అయిపోతోంది. ఉప్పాడ తీరంలో చేపల వేటను ఆధారంగా చేసుకుని చాలా మంది మత్స్యకారులు బతుకుతున్నారు. ఇప్పుడు వారి జీవనోపాధికే భంగం కలిగే ఆపద వాటిల్లింది. అందుకే మత్స్యకారులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఇంతకు ముందే దీని గురించి అధికారులకు చెప్పినా పట్టంచుకోలేదు. నేతలతో మొరపెట్టుకున్న పని జరగలేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అందుకే ఇప్పుడు ధర్నా చేస్తున్నామని తెలిపారు. సుమారు వెయ్యి మంది మత్స్యకారులు మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు.

Also Read : Cricket : చెలరేగిన భారత బ్యాటర్లు..రోహిత్, గిల్ సెంచరీలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News: చపాతీలతో తల్లీ కొడుకుకి అస్వస్థత..

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Apr 08, 2025 07:24 IST

    కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

    గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,740, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83, 250, ఒక కేజీ వెండి ధర రూ.92,112 పలికింది.

    today gold rates
    today gold rates Photograph: (today gold rates)

     



  • Apr 08, 2025 07:23 IST

    ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

    అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపారులకు సూచించారు. ఈ మేరకు 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని ఆదేశించారు.



  • Apr 08, 2025 07:23 IST

    ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో పిడుగుల వర్షం

    బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 10, 11.12,13 తేదీల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.



  • Apr 08, 2025 07:22 IST

    తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

    తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!



  • Apr 08, 2025 07:22 IST

    ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!



  • Apr 08, 2025 07:21 IST

    క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!



Advertisment
Advertisment
Advertisment