Andhra Pradesh: ఉప్పాడ సముద్రతీరంలో మత్స్యకారుడు గల్లంతు.. అధికారుల గాలింపు చర్యలు..

కాకినాడ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో ఓ మత్స్యకారుడు ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. ఉప్పాడ గ్రామం నాయకర్ కాలనీకి చెందిన మత్స్యకారుడు వంకా కృష్ణారావుగా గుర్తించారు.

New Update
Andhra Pradesh: ఉప్పాడ సముద్రతీరంలో మత్స్యకారుడు గల్లంతు.. అధికారుల గాలింపు చర్యలు..

Fisherman Missing in Sea: కాకినాడ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ(Uppada) సముద్ర తీరంలో ఓ మత్స్యకారుడు(Fisherman) ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. ఉప్పాడ గ్రామం నాయకర్ కాలనీకి చెందిన మత్స్యకారుడు వంకా కృష్ణారావుగా గుర్తించారు. సోమవారం తొమ్మిది మంది మత్స్యకారులు బోటుపై సముద్రంలో వేటకు వెళ్లారు. అయితే, వల లాగుతున్న సమయంలో అనుకోకుండా వల కాలికి తగిలి సముద్రంలోకి జారి పడ్డాడు కృష్ణారావు. వెంటనే తోటి మత్స్యకారులు గాలించినప్పటికీ జారిపడిన వ్యక్తి జాడ దొరకలేదు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయంపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు గాలిపంఉ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే గల్లంతైన యువకుడిని గాలించేందుకు హెలికాప్టర్‌ను ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. బాధిత కుటుంబానికి వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే పెండెం. కాగా, గల్లంతైన వ్యక్తి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కృష్ణారావు గల్లంతు వార్తతో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రలో మునిగిపోయారు.

అమ్మమ్మ ఇంటికి సెలవులకు వచ్చి.. 

గోదావరి నదిలో విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. సాధనాల సాయి అనే విద్యార్థి దసరా సెలవుల సందర్భంగా అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఐదుగురు యువకులతో కలిసి పుణ్యస్నానాలు ఆచరించేందుకు గోదావరి నదికి వెళ్లారు. దసరా పండుగ ఓ ఇంట విషాదం నింపింది. దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లి.. ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. యువకుడి ప్రాణాలు పోవటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి.

సరా సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చి గోదావరి నదిలో విద్యార్థి గల్లంతైయ్యాడు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం కే. ఏనుగుపల్లిలో చోటుచేసుకుంది. కె.ఏనుగుపల్లి బాడవ వద్ద గోదావరిలోకి స్నానానికి ఐదుగురు యువకులు కలిసి దిగిన్నారు. వీరిలో ఒకరు గల్లంతు కాగా.. నలుగురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. సోమవారం సాయంత్రం సరదాగా గోదావరి నది వద్దకు వెళ్లి గోదావరిలో యువకులు స్నానం చేశారు. ఇంతలో అమలాపురంకు చెందిన సాధనాల సాయి (15) గల్లంతైయ్యాడు. సాయి కోసం రాత్రి గాలింపు చర్యలు చేపట్టగా విద్యార్థి మృతదేహం దొరకలేదు. ఉదయం కూడా గల్లంతైన విద్యార్థి కోసం రెవెన్యూ, పోలీసు అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా విద్యార్థి మృతదేహం లభ్యమైంది. యువకుడి మృతదేహం చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read:

అతివలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ ఎంతంటే..

మనిషి కాదు రాక్షసి.. ఏడుస్తోందని చిన్నారిని చిదిమేసింది.. ఎక్కడ జరిగిందంటే..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..

సింగపూర్ స్కూల్లో మంటల్లో గాయాలపాలై ఏపీ డిప్యూటీ సీఎవ కుమారుడు మార్క్ శంకర్...చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడితో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు.

author-image
By Manogna alamuru
New Update
ap

Mark Shankar

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. అతనిని కొద్దిసేపటి క్రితమే ఇండియాకు తిరిగి తీసుకుని వచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు. చికిత్స అనంతరం బాబు కోలుకున్నాడని తెలుస్తోంది. అయితే కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని..అందుకే ఇండియాలో ఇంట్లోనే ఉంచి జాగ్రత్తలు తీసుకోనున్నారని చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | deputy-cm-pawan-kalyan | pawan kalyan son mark shankar

Also Read: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

Advertisment
Advertisment
Advertisment