Uttarakhand: టన్నెల్ లో చిక్కుకున్న 41 మంది కనిపించారు..ఆహారం పంపిన అధికారులు!

ఉత్తర కాశీలో పది రోజులుగా టన్నెల్‌ లో చిక్కుకున్న కార్మికులు క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారికి ఆహారం, అల్పాహారంతో పాటు మరికొన్ని అవసరమైన వస్తువులను అందించినట్లు అధికారులు వివరించారు.

New Update
Uttarakhand: టన్నెల్ లో చిక్కుకున్న 41 మంది కనిపించారు..ఆహారం పంపిన అధికారులు!

పది రోజుల క్రితం ఉత్తర కాశీలోని టన్నెల్‌ కూలడంతో 41 మంది కార్మికులు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఆ కార్మికులు ప్రస్తుతం 6 అంగుళాల పైప్‌ లైన్‌ ద్వారా ప్రస్తుతం వారికి వేడి వేడి ఆహారాన్ని అధికారులు పంపించారు. తాజాగా వారు టన్నెల్లో ఉన్న చిత్రాలు కెమెరాకు చిక్కడంతో వెలుగులోకి వచ్చాయి. సొరంగం లోపల ఉన్న కార్మికులందరూ కూడా ఆరోగ్యంగానే కనిపించారు.

సొరంగంలో శిథిలాలు పడిపోవడంతో వారంతా 10 రోజులుగా చిక్కుకుపోయారు. రెస్క్యూ టీమ్‌ కొత్త పైప్‌ లైన్‌ ని ఉపయోగించి కెమెరాను లోపలికి పంపింది. దానిలో వారంతా కూడా క్షేమంగా ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా వారిని ఇప్పుడు ప్రతి క్షణం బయట నుంచి మానిటర్ చేయవచ్చు. ముందు వారు ఉన్న ప్రదేశంలో లైటింగ్‌ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

కెమెరా లోపలకు వెళ్లిన తరువాత దాని ముందు నిలబడిన కార్మికులంతా కూడా వాకీటాకీల ద్వారా మాట్లాడారు. బృంద సభ్యులందరూ సమీపంలో నిలబడి ఉన్నారు. వారంతా కూడా ఆరోగ్యంగా, ఫిట్‌ గా కనిపిస్తున్నారు. 10 రోజులుగా లోపల చిక్కుకుని ఉన్న కార్మికులకు సోమవారం రాత్రి వారికి ఆహారంగా కిచిడీ పంపారు.

దానిని బాటిళ్లలో నింపి పైపుల ద్వారా వారికి అందించారు. అంతేకాకుండా వారికి వేడివేడి అల్పాహారం సిద్ధం చేశారు. కార్మికులకు మొబైల్స్‌ తో పాటు మరికొన్ని ఉపయోగకరమైన వస్తువులను వారికి అందించినట్లు అధికారులు వివరించారు. ఆగర్‌ మిషన్‌ ద్వారా కార్మికులు ఉన్న టన్నెల్‌ లోకి ఇనుప పైపును అమర్చే ప్రయత్నం చేస్తున్నారు.

Also read: ఇద్దరమ్మల కడుపు పంచుకున్న బిడ్డ: కళ సాకారం చేసుకున్న స్పెయిన్ స్వలింగ జంట!

Advertisment
Advertisment
తాజా కథనాలు