Hyderabad:హైదరాబాద్‌లో తొలి మానవ రహిత విమానం ఆవిష్కరణ

మన దేశంలోనే తయారు చేసిన మొదటి మానవ రహిత విమానాన్ని ఇవాళ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. తుక్కుగూడలోని అదానీ ఏరోస్పేస్ పార్క్‌లో నేవీ ఛీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ దీన్ని ప్రారంబించారు. ఈ కార్యక్రమానికి ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు ఇందులో పాల్గొన్నారు.

New Update
Hyderabad:హైదరాబాద్‌లో తొలి మానవ రహిత విమానం ఆవిష్కరణ

యూఏవీ రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. మొదటిసారిగా మానవరహిత విమానాన్ని తయారు చేయడమే కాకుండా దాన్ని ప్రారంబించారు. దృష్టి 10 స్టార్‌లైనర్‌గా దీన్ని పిలుస్తున్నారు. మానవరహిత విమానానికి ఇంటెలిజెన్స్, నిఘా సామర్ధ్యాలున్నాయని చెబుతున్నారు. తుక్కుగూడలోని అదానీ ఏరోస్సేస్ పార్క్‌లో నేవీ ఛీఫ్ అడ్మిరల్ ఆర్ మరికుమార్, తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్‌బాబులు కలిసి ప్రారంభించారు. ఈ యూఏవీ విమానం గాల్లో 36 గంటల పాటూ ఎగరగలదు. 450 కిలోల పేలోడ్ తీసుకెళ్ళగలదు. స్టాంగ్‌4671 సర్టిఫికేషన్‌తో అన్ని రకాల వాతావరణాల్లోనూ పనిచేయగలదు అని చెబుతున్నారు.

Also read:నా దేశానికి బెస్ట్ ఇవ్వడానికే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తా..మహ్మద్ షమీ

ఆత్మనిర్భర్‌లో యూఏవీ విమానం కీలక అడుగు అని వ్యాఖ్యానించారు అడ్మిరల్ హరికుమార్. దీనితో సముద్రంమీద ఆధిపత్యాన్ని సాధించగలమని చెప్పారు. ఐఎస్ఆర్ సాంకేతికలో భారత్ సాధించిన అద్భుత పరిణామంగా అభివర్ణించారు. అదానీ గ్రూప్ ఏరో తయారీపైనే కాకుండా..వాటి సామర్ధ్యాలను మెరుగుపరచడంలో కూడా పురోగతిని సాధించిందని చెప్పారు. భారత ఏరో రంగంగ అభివృద్ధి చెందడంలో అదానీ గ్రూప్ కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. దృష్టి 10ను నౌకాదళ కార్యకలాపాల్లో భాగస్వామిని చేయడంతో మా సామర్థ్యాలు మెరుగుపడనున్నాయని హరి కుమార్ చెప్పారు. సముద్ర గస్తీలో మా సంసిద్ధత బలోపేతం అవుతుంది. కేవలం 10 నెలల్లోనే ఈ యూఏవీని అదానీ గ్రైప్ తయారు చేసిందని కొనియాడారు.

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యూఏవీని ఆవిష్కరించడం గొప్ప విజయమని అన్నారు తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ అంతర్జాతీయ పెట్టుబడులు పెట్టే వాళ్ళకు హైదరాబాద్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని...ఇక్కడ పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సమిస్తుందని చెప్పారు. ఏరోస్పేస్ తయారీలో, సాంకేతిక పరంగా కూడా హైదరాబాద్ ముందుందని తెలిపారు. భారత రక్షణ రంగంలో అదానీ డిఫెన్స్ ఏరోస్పేస్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు