Jammu-Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో కాల్పులు..ముగ్గురు ఉగ్రవాదులు మృతి

జమ్మూ-కాశ్మీర్‌లో మళ్ళీ జవాన్లకు , ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. అంతేకాదు వారి నుంచి మందుగుండు సామాగ్రి, ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

New Update
 Jammu-Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో కాల్పులు..ముగ్గురు ఉగ్రవాదులు మృతి

Terrorists Killed In Firing: జమ్మూకాశ్మీర్‌లో కొంతకాలంగా టెర్రరిస్టుల కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు వారాల క్రితం పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య వరుసగా ఎదురు కాల్పులు జరిగాయి. అప్పటి నుంచి డోడా, రాజౌరీ, పూంచ్‌ ప్రాంతాల్లో వీరిని ఏరివేసే ఆపరేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో మళ్ళీ ఉగ్రవాదుల కదలికలు ఇన్ఫర్మేషన్ రావడంతో భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. డోడా జిల్లాలో ముష్కరులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు టెర్రరిస్టులు హతం అయ్యారు. దాంతో పాటూ ఘటనా స్థలం నుంచి భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

జూన్‌ 11న ఉగ్రవాదులు మొదట కాల్పులు చేశారు. ఈ కాల్పుల్లో ఐదుగురు సైనికులతో పాటు ఓ పోలీసు అధికారి తీవ్ర గాయాలపాలయ్యారు. మరోసారి పోలీస్‌ క్యాంపుపైనా దాడులు చేశారు. ఇంకోవైపు భారత వాయుసేన ఉన్న పఠాన్‌ కోట్‌ జిల్లాలోనూ భారీ ఆయుధాలతో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో అక్కడ కూడా హైఅలర్ట్‌ ప్రకటించారు.

Also Read:USA Elections: రేపే బైడెన్ – ట్రంప్‌ మధ్య డిబేట్‌.. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ

Advertisment
Advertisment
తాజా కథనాలు