Breaking : కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు! కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పై కూలర్ల షాప్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. By Bhavana 26 Apr 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad : కూకట్ పల్లి(Kukatpally) లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. జాతీయ రహదారి పై కూలర్ల షాప్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. మంటలు పక్కనే అనుకుని ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్(Traffic Police Station) ఆవరణలోని పలు ద్విచక్ర వాహనాలకు నిప్పంటుకోవడంతో పూర్తిగా వాహనాలు దగ్దమయ్యాయి. జాతీయ రహదారి కావడంతో ప్రయాణికులు, స్థానికులు మంటలను చూసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో రెండు దుకాణాలు దగ్ధం కాగా, 10 ద్విచక్ర వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జాప్యం జరిగితే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని వందలాది ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యేవని పోలీసులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. Also Read: ఈవీఎం-వీవీప్యాట్ల లెక్కింపు పై నేడు సుప్రీం తీర్పు! #telangana #hyderabad #fire-accident #kukatpally #coolers-shop మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి