Health Tips : సోంపు వల్ల కలిగే లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు మన ఇళ్లల్లో కనిపించే సోంపు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. సోంపు వాటర్‌ను తాగితే బరువు తగ్గడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం లాంటి ప్రయోజనాలను చేకూరుస్తుంది. శరీరంలో నుంచి విషపదార్థాలను తొలగించడం, రుతుక్రమ సమస్యలను కూడా నియంత్రిస్తుంది. By B Aravind 20 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Fennel Water : మన వంటిట్లో చూసుకుంటే ఎన్నో వంట పదార్థాలు కనిపిస్తాయి. కానీ చాలామంది ఇళ్లలో కనిపించే పదార్థాల్లో ఒకటి సోంపు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కూరల్లో సోంపు(Fennel) ను దినుసుగా వాడుతుంటారు. అలాగే ఛాయ్ వంటి పానీయాల్లో కూడా ఎక్కువగా వాడుతుంటారు. ఎందుకంటే ఇది మంచి ఫ్లేవర్‌ను ఇస్తుంది. అంతేకాదు మౌత్ ఫ్రెషర్‌గా కూడా చాలామంది సోంపును వాడుతుంటారు. Also Read : సీతారామ ప్రాజెక్టులోనూ మేఘా కృష్ణారెడ్డి భారీ దోపిడి బరువు తగ్గిస్తుంది సోంపు అనేది ఆహార పదార్థాలకు రుచి, ఫ్లేవర్‌ను ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచింది. మన ఇంట్లోనే సోంపు వాటర్(Fennel Water) ను తయారుచేసుకుని తాగితే దీని నుంచి మంచి ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా ఇది బరువు తగ్గడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం లాంటి ప్రయోజనాలను చేకూరుస్తుంది. భోజనం చేసిన తర్వాత చాలామంది సోంపును నమలడం మనం చూస్తూనే ఉంటారు. ఇది జీర్ణక్రియను సాఫీగా చేయడంతో సహా.. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కొవ్వు కరిగిస్తుంది మరో విషయం ఏంటంటే సోంపులో ఉండే ఫైబర్(Fiber) ద్వారా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల ఆహారాన్ని మితంగా తీసుకుంటాం. అయితే సోంపుతో శరీరంలో కొవ్వు కూడా కరుగుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరచడంతో.. ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించే శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ సోంపు శరీరంలో నుంచి విష పదార్థాలను తొలగించడంతో పాటు.. రుతుక్రమ సమస్యలను కూడా నియంత్రిస్తుందని అంటున్నారు. Also Read: ఉప్పు ఎక్కువగా తింటున్నారా..అయితే ఈ వ్యాధుల ముప్పులు తప్పవంటున్న డబ్ల్యూహెచ్ వో! #telugu-news #health-tips #easy-kitchen-tips #fennel మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి