చంద్రబాబును కలిసిన కుటుంబసభ్యులు

రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులు భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి కలిశారు. వారితో మాజీ మంత్రి యనమల రామకృష్ణ కూడా ఉన్నారు.

New Update
Chandrababu: రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో చంద్రబాబును కలిసిన నారా భువనేశ్వరి

స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో స్కామ్ కు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత బాబు నాయుడిని సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. అయితే సోమవారం జైలులో ఉన్న చంద్రబాబును కుటుంబసభ్యులు కలిశారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ములాఖత్‌ ద్వారా కలిశారు.

చంద్రబాబు ఏ తప్పూ చేయలేదు.తప్పులు చేసిన నాయకులే ఆయన్ను ఈ కేసులో ఇరికించారన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. తప్పుడు కేసులతో ఈ ప్రభుత్వం ఆయనను వేధిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు జైలులో సంతోషంగా లేరు. పార్టీ కార్యకర్తల గురించి అడిగారు. వైకాపా ప్రభుత్వం వల్ల ప్రజలంతా కష్టాలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు గదిలో ఏసీ లేదు.. ఆయన్ను ఉంచిన గదిలో దోమలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతకుముందు రాజమండ్రి శ్రీ సిద్ది లక్ష్మీ గణపతి ఆలయంలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరతో కలిసి రాజమండ్రి నాళం భీమరాజు వీధిలోని వినాయకుడి ఆలయానికి చేరుకున్న భువనేశ్వరి స్వామివారికి పూజలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం కోసం భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో రాబోయే 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

New Update
Rains

Rains

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment