Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ ఇసుకకు భారీ డిమాండ్.. ప్రభుత్వానికి రూ.500 కోట్ల ఆదాయం ! మేడిగడ్డ బ్యారేజీ వద్ద పెద్ద మొత్తంలో ఇసుక ఉందని.. దాన్ని వేలానికి పెడితే రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 500 నుంచి 600 కోట్ల ఆదాయం వస్తుందని నీటిపారుదల శాఖ, మైనింగ్ శాఖ అధికారుల అంచనా వేస్తున్నారు. By B Aravind 07 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అందులో లోపాలను పరిష్కరించడం కోసం ప్రభుత్వానికి కూడా ఆర్థిక నష్టం కలగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మేడిగడ్డలో ఉన్న ఇసుకతో రాష్ట్ర ఖజానాకు నిధులు చేకూర్చనుంది. నీటిపారుదల శాఖ, మైనింగ్ శాఖ అధికారుల అంచనా ప్రకారం.. 'మేడిగడ్డలో ఎన్నో ఏళ్లుగా అక్కడ పెద్ద మొత్తంలో ఇసుక ఉంది. ఇది దాదాపు 92 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఈ మట్టి తవ్వకాలకు వేలం పెడితే దాదాపు 500 నుంచి 600 కోట్ల ఆదాయం వస్తుంది. గోదావరి నది మట్టికి మంచి డిమాండ్ ఉంది. ఆ మట్టి క్వాలిటీ బాగుంటుందని' అధికారులు చెబుతున్నారు. Also read: తెలంగాణలో రాజకీయ సంక్షోభం.. 38 మంది ఎమ్మెల్సీల పదవులు ఫట్? ఇటీలే తెంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.. బ్యారెజీ చుట్టూ ఉన్న 14 బ్లాకుల్లో ఇసుక తవ్వకాల కోసం టెండర్లకు పిలిచిందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. దాదాపు 383 మంది కాంట్రాక్టర్లు ఈ వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. టెక్నికల్ బిడ్స్ శుక్రవారం ప్రారంభం కాగా.. ఫైనాన్సియల్ బిడ్స్ సోమవారం ప్రారంభమవుతాయని చెప్పారు. అయితే 2019 నుంచి మేడిగడ్డ బ్యారేజీ వద్ద పెద్ద మొత్తంలో వాటర్ నిల్వ ఉన్నందున.. అక్కడ పెద్ద మొత్తంలో ఇసుక పేరుకుపోయిందని నిపుణులు తెలిపారు. గోదావరిలో నిరంతరం నీటి ప్రవాహం ఉంటే.. బ్యారేజీ దిగువకు ఇసుక కొట్టుకుపోయి ఉండేదని.. కానీ అలాంటిది జరగలేదని పేర్కొన్నారు. రెండేళ్ల ఒప్పందానికి చాలామంది బిడ్డర్లు ఇసుకను వెలికితీసేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వెంటనే పనులు ప్రారంభిస్తారని చెప్పారు. అయితే ఒక టన్ను ఇసుకకు మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు రూ.400 వస్తుండగా.. బిడ్డర్లు మాత్రం ఒక టన్నుకు రూ.1000 నుంచి 1200 వరకు విక్రయిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా మరోవైపు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద కూడా ఇరిగేషన్, మినరల్ డెవలాప్‌మెంట్ కార్పొరేషన్ సర్వే నిర్వహించాయి. కానీ ఆ రెండు ప్రాంతాల్లో నీటి ప్రవాహం వల్ల.. చాలా తక్కువగా ఇసుక నిల్వలు ఉన్నట్లు గుర్తించాయి. Also Read: మరోసారి రెచ్చిపోయిన పార్థీ గ్యాంగ్.. ఆ విల్లాస్‌లో భారీ చోరీ! #telugu-news #medigadda #sand #medigadda-barrage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి