SGT EXAM: ఎస్జీటీ ఉద్యోగాల కోసం అప్లై చేశారా.. ఈ టిప్స్ మీకోసమే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారి కోసం హైదరాబాద్‌లోని బాసర ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కీలక నిపుణుడు పలు సూచనలు చేశారు. ఈ టిప్స్ కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 06 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి గత కొంతకాలంగా నిరుద్యోగులు నోటిఫికేషన్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే కాంగెస్ సర్కార్.. జిల్లాల్లో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలు మొదలయ్యాయి. ఏప్రిల్ 2న దరఖాస్తు స్వీకరణ గడువు ముగియనుంది. డీఎస్సీ పరీక్షకు కొత్తగా అప్లై చేసుకునేవారు.. రూ.1000 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో చేసిన వారు తిరిగి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ పరీక్షలు లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాకే నిర్వహించనున్నట్లు సమాచారం. Also Read: విద్యార్ధులకు అలెర్ట్.. ఐసెట్ నోటిఫికేషన్ విడుదల మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. పరీక్షలు మొత్తం ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని.. 11 పట్టణాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అలాగే మెగా డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT) పోస్టులకు సంబంధించి కూడా రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డీఎడ్ అర్హులు మాత్రమే ఎస్‌జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో బోధించడానికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) పేపర్-2 ఉత్తీర్ణులైనవారికి అవకాశం ఇవ్వడం లేదని చెప్పింది. బీఈడీ నేపథ్యంలో ఉన్నవాళ్లు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే అప్లై చేసుకోవాలని తెలిపింది. ఎస్‌జీటీ ఉద్యోగం సాధించేందుకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేదానిపై బాసర ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డైరెక్టర్ దాసరి శ్రీనివాస్ పలు సూచనలు ఇచ్చారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా SGT ఉద్యోగం సాధించాలంటే Maths, English Methods, PIE సబ్జెక్టులపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. వీటిపై ఎంత శ్రద్ధ వహిస్తే అంత సులభంగా SGT ఉద్యోగం సాధించవచ్చు. అలాగే Science, Social, G.K & Current Affairs, Telugu సబ్జెక్టులను ఒక ప్రణాళికబద్ధంగా చదివితే అధికంగా స్కోర్ సాధించవచ్చు. School Assistant ఉద్యోగంలో ప్రధాన పాత్ర మెథడాలజీ మీదే ఆధారపడి ఉంటుంది. పరీక్షలో 6వ తరగతి నుంచి ఇంటర్ సిలబస్ వరకు ప్రశ్నలు వస్తాయి. Maths, Physical Science, Bio Science లాంటి సబ్జెక్టులను EAMCET స్థాయిలో ఇంటర్ సిలబస్ ప్రిపెర్ అవ్వాలి. ఇంటర్ సిలబస్ నుంచి కూడా ప్రశ్నలు కఠినంగా వచ్చే అవకాశం ఉంది. Also Read: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..విశాఖ, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లలో ఉద్యోగాలు ఇట్లు Dasari Srinivas Director BASARA INSTITUTE, HYDERABAD #telugu-news #telangana-news #mega-dsc #ts-mega-dsc-2024 #secondary-grade-teachers-sgt మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి