Delhi Capitals : భారీ స్కోరు తో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ... By Durga Rao 07 May 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి IPL 2024 : ఐపీఎల్ తాజా సీజన్ లో ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపడాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టు బ్యాటింగ్ లో అదరగొట్టింది. ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium) లో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్... నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగులు చేసింది. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్, అభిషేక్ పోరెల్ అర్ధసెంచరీలతో అదరగొట్టగా... ఆఖర్లో ట్రిస్టాన్ స్టబ్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మెక్ గుర్క్, పోరెల్ జోడీ తొలి వికెట్ కు 60 పరుగులు జోడించి శుభారంభం అందించింది. మెక్ గుర్క్ 20 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు చేయగా, పోరెల్ 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 65 పరుగులు చేశాడు. షాయ్ హోప్ (1), అక్షర్ పటేల్ (15), కెప్టెన్ రిషబ్ పంత్ (15) ఆశించిన మేర రాణించలేకపోయారు. ఈ దశలో ట్రిస్టాన్ స్టబ్స్ విరుచుకుపడడంతో ఢిల్లీ స్కోరు 200 మార్కు దాటింది. స్టబ్స్ 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు కొట్టాడు. ఐపీఎల్ తో తొలి మ్యాచ్ ఆడుతున్న గుల్బదిన్ నాయబ్ 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో 19 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3, ట్రెంట్ బౌల్ట్ 1, సందీప్ శర్మ 1, చహల్ 1 వికెట్ తీశారు. Also Read : పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల్లో నీరజ్ చోప్రా..! #delhi-capitals #ipl-2024 #rr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి
ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్, అభిషేక్ పోరెల్ అర్ధసెంచరీలతో అదరగొట్టగా... ఆఖర్లో ట్రిస్టాన్ స్టబ్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మెక్ గుర్క్, పోరెల్ జోడీ తొలి వికెట్ కు 60 పరుగులు జోడించి శుభారంభం అందించింది. మెక్ గుర్క్ 20 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు చేయగా, పోరెల్ 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 65 పరుగులు చేశాడు. షాయ్ హోప్ (1), అక్షర్ పటేల్ (15), కెప్టెన్ రిషబ్ పంత్ (15) ఆశించిన మేర రాణించలేకపోయారు. ఈ దశలో ట్రిస్టాన్ స్టబ్స్ విరుచుకుపడడంతో ఢిల్లీ స్కోరు 200 మార్కు దాటింది. స్టబ్స్ 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు కొట్టాడు. ఐపీఎల్ తో తొలి మ్యాచ్ ఆడుతున్న గుల్బదిన్ నాయబ్ 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో 19 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3, ట్రెంట్ బౌల్ట్ 1, సందీప్ శర్మ 1, చహల్ 1 వికెట్ తీశారు. Also Read : పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల్లో నీరజ్ చోప్రా..!