Pakistan: పంజాబ్‌ ప్రావిన్స్‌ తొలి సీఎంగా మరియం నవాజ్‌..

పాకిస్థాన్‌లో పంజాబ్‌ ప్రావిన్సు తొలి మహిళా ముఖ్యమంత్రిగా.. మాజీ ప్రధాని నవాజ్‌ షరీప్‌ కూతురు మరియం నవాజ్‌ (50) ఎన్నికయ్యారు. పంజాబ్‌లోని అసెంబ్లీలో ఓటింగ్ జరిగిన అనంతరం గవర్నర్‌ హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పంజాబ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

New Update
Pakistan: పంజాబ్‌ ప్రావిన్స్‌ తొలి సీఎంగా మరియం నవాజ్‌..

పాకిస్థాన్‌లో పంజాబ్‌ ప్రావిన్సు తొలి మహిళా సీఎంగా మరియం నవాజ్‌ (50) ఎన్నికయ్యారు. ఈమె ఎవరో కాదు పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీప్‌ కూతురు. పాక్‌లో రాజకీయపరంగా, జనాభాపరంగా పంజాబ్‌ ప్రావిన్సు ఎంతో కీలకమైంది. ఈ ప్రాంతానికి ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. ప్రస్తుతం మరియం నవాజ్‌ పాకిస్థాన్ ముస్లీం లీగ్-నవాజ్ (PML-N) ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయితే పంజాబ్‌లోని అసెంబ్లీలో సీఎం అభ్యర్థిత్వం కోసం ఓటింగ్ జరిగింది.

Also read: పాలస్తీనా ప్రధాని రాజీనామా.. కారణం ఇదే..

దీనికి మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ మద్దతు కలిగిన సన్నీ ఇత్తేహాద్‌ కౌన్సిల్‌ (SIC) చట్టసభ సభ్యులు వాకౌట్ చేశారు. ఇక చివరికి పీఎంఎల్‌ఎన్‌ పార్టీ తరఫున మరియం నవాజ్‌ గెలుపు ఖరారైపోయింది. ఆ తర్వాత గవర్నర్‌ హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పంజాబ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తండ్రి నవాజ్‌ షరీఫ్‌, బాబాయ్ షెహబాజ్ షరీఫ్‌ల సమక్షంలో బాధ్యతలను చేపట్టారు. అయితే దేశ చరిత్రలో పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ఒక మహిళ ఎన్నికల కావడం మరో విశేషం.

పంజాబ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళగా మరియం నవాజ్‌ చరిత్ర సృష్టించారని PML-N పార్టీ ట్వీట్‌ చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరియం నవాజ్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి నవాజ్‌ షరీఫ్‌ గతంలో కూర్చున్న స్థానంలో తాను ఇప్పుడు కూర్చోవడం సంతోషంగా ఉందని చెప్పారు. మహిళా నాయకత్వం భవిష్యత్తులో కూడా కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు. అలాగే ఎవరిపైనా కూడా తాను ప్రతికారం తీర్చుకోనని స్పష్టతనిచ్చారు.

Also read: అగ్రరాజ్యంలో తెలంగాణ యువకుడు మృతి!

Advertisment
Advertisment
తాజా కథనాలు