Telangana : తీహార్ జైలులో కవితతో కేటీఆర్, హరీష్ ములాఖాత్

తీహార్‌ జైల్లో ఉంటున్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితతో.. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు ములాఖాత్ అయ్యారు. న్యాయవ్యవస్థకు తమపై నమ్మకం ఉందని, త్వరలోనే బెయిల్ వస్తుందని కవితకు ధైర్యం చెప్పారు. అలాగే సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్‌ వేయనున్నారు.

New Update
Telangana : తీహార్ జైలులో కవితతో కేటీఆర్, హరీష్ ములాఖాత్

Delhi Liquor Scam : లిక్కర్‌ కేసుకు సంబంధించి మనీలాండరింగ్‌ కేసు (Money Laundering Case) లో అరెస్టయి తీహార్‌ జైల్లో ఉంటున్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) తో.. మాజీ మంత్రులు కేటీఆర్‌ (KTR), హరీష్‌ రావు (Harish Rao) ములాఖాత్ అయ్యారు. కాసేపు ఆమెతో మాట్లాడారు. న్యాయవ్యవస్థకు తమపై నమ్మకం ఉందని కవితకు ధైర్యం చెప్పారు. త్వరలోనే బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు కవితను బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.

Also Read: తెలంగాణకు కొత్త చీఫ్‌ ఎలక్టోరల్ ఆఫీసర్‌.. ఎవరంటే ?

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసేందుకు కవిత ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీ న్యాయ నిపుణుల బృందంతో కేటీఆర్‌, హరీష్‌ రావులు చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో.. సోమవారం రోజున బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు ఢిల్లీలోనే కేటీఆర్, హరీష్‌రావులు ఉండనున్నట్లు సమాచారం.

Also read: బీఆర్‌ఎస్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఆ 7గురు ఎమ్మెల్యేలు జంప్?

Advertisment
Advertisment
తాజా కథనాలు