KCR: ఎకరాకు రూ.25 వేలు పరిహారమివ్వాలి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటన చేశారు. సూర్యాపేట, జనగామ జిల్లాల్లో ఎండిపోయిన పంటలు పరిశీలించారు. ఆ తర్వాత రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. By B Aravind 31 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి KCR Press Meet at Suryapet: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటన చేశారు. సూర్యాపేట, జనగామ జిల్లాల్లో ఎండిపోయిన పంటలు పరిశీలించారు. ఆ తర్వాత రైతుల సమస్యలను (Farmers' problems) అడిగి తెలుసున్నారు. అలాగే జనగామ జిల్లా ధారవత్ తండాలో పరిహారం ఇప్పించాలని అన్నదాతలు కేసీఆర్‌ను వేడుకున్నారు. అనంతరం కేసీఆర్ మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ (Congress) వంద రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసున్నారని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మళ్లీ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని అనుకోలేదన్నారు. Also Read: సత్తుపల్లిలో పోలీసులపై గిరిజనులు దాడి..సీఐ కిరణ్‌ను కర్రలతో ఎలా కొట్టారో చూడండి! మిమ్మల్ని నమ్మి మోసపోయారు ' దేశంలో మొదటి స్థానంలో ఉన్న తెలంగాణకు అతితక్కువ కాలంలోనే ఈ దుస్థితి ఎందుకు రావాలి. నీళ్లిస్తారని నమ్మి పంటలు వేసుకున్నాం. ముందుగానే చెప్పినట్లైతే వేసుకునేవాళ్లం కాదని రైతులు వాపోతున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి. పదేళ్లలో బీఆర్‌ఎస్ (BRS) రైతుల కోసం అనుకూల విధానాలు చేపట్టింది. రైతుబంధు పేరుతో అన్నదాతలు పెట్టుబడి సాయం ఇచ్చాం. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి గింజ ఉన్నాం. దిగుబడిలో పంజాబ్‌ను దాటిపోయామం. రుణమాఫీ ఏమైంది మిషన్ భగీరథ నిర్వహణలో లోపాలు ఎందుకు వస్తున్నాయి. మా హయాంలో బిందె పట్టుకొని ఏ ఆడబిడ్డ కూడా కనిపించలేదు. ఎక్కడా కూడా నీళ్ల ట్యాంకర్లు కనిపించేవి కావు. ఇవాళ హైదరాబాద్‌లో ఎందుకు వాటర్ ట్యాంకర్లు కనిపిస్తున్నాయి. మా పాలనలో అద్భుతంగా ప్రజలకు కరెంట్ అందించాం. అప్పట్లో కరెంట్ పోతే వార్త.. ఇప్పుడు వస్తే వార్తగా మారింది. అగ్రగ్రామిగా ఎదిగిన రాష్ట్రానికి ఎందుకు చెదలుబట్టింది. ప్రభుత్వం అసమర్థత, అలసత్వం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. మళ్లీ రాష్ట్రంలో జనరేటర్లు, ఇన్వెర్టర్లు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్ సిటీగా మే మార్చాం. నేషనల్ పవర్ గ్రిడ్‌కు అనుసంధానం చేశాం. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఇంతవరకు ఎందుకు చేయలేదని' కేసీఆర్ అన్నారు. Also Read: బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌లో గెలిస్తే.. రాజ్యాంగం నాశనమవుతుంది : రాహుల్ గాంధీ #kcr #telugu-news #telangana-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి