Kannappa : 'తిన్నడు' పాత్రలో మంచు విష్ణు కొడుకు.. కన్నప్ప అప్డేట్

మంచు విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కన్నప్ప'. నేడు కృష్ణాష్టమి సందర్భంగా మూవీ నుంచి మంచు విష్ణు కొడుకు అవ్రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో అవ్రామ్ 'తిన్నడు' అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. అవ్రామ్ లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

New Update
Kannappa : 'తిన్నడు' పాత్రలో  మంచు విష్ణు కొడుకు.. కన్నప్ప అప్డేట్

Manchu Vishnu Son Avram First Look: బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ సింగ్ రాజ్ కుమార్, మంచు విష్ణు (Manchu Vishnu) కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' (Kannappa). భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, నయనతార, ముఖేష్ రిషీ, సంపత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని Ava ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇక ప్రేక్షకులకు సినిమా పై ఆసక్తిని పెంచేలా వరుస అప్డేట్లతో ఇస్తున్నారు మేకర్స్. సినిమాలోని పాత్రలను ఒకదాని తర్వాత ఒకటి పరిచయం చేస్తూ క్యూరియాసిటీనీ పెంచుతున్నారు.

అవ్రామ్‌ మంచు ఫస్ట్ లుక్

నేడు కృష్ణాష్టమి సందర్భంగా మరో స్పెషల్ రోల్ ను పరిచయం చేశారు. సినిమాలో మంచు విష్ణు కొడుకు అవ్రామ్‌(Avram) పాత్రతో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో అవ్రామ్‌ 'తిన్నడు' అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. అయితే అవ్రామ్‌ చాలా తక్కువ డ్యూరేషన్ మాత్రమే ఉండనున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న చిత్రంలో స్టార్ యాక్టర్స్, స్టార్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఇండియాస్ మోస్ట్ పాపులర్ ప్రభుదేవ కొరియోగ్రఫీ చేస్తుండగా.. మెలోడీ మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Emergency: చిక్కుల్లో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ'.. విడుదల ఆపేయాలని ఎంపీ లేఖ - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు