Kalki 2898 AD: 'కల్కి'కి జాక్ పాట్.. ఓటీటీ రైట్స్ కోసం రెండు దిగ్గజ ప్లాట్ ఫార్మ్స్ బరిలో ...!

ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ 'కల్కి' విడుదలైన తొలిరోజు నుంచే రికార్డు వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ మూవీ OTT రిలీజ్‌కు సంబంధించి ఓ న్యూస్ వైరలవుతోంది. హిందీలో నెట్‌ఫ్లిక్స్ 175 కోట్లకు, సౌత్ భాషల్లో అమెజాన్‌ప్రైమ్ 200 కోట్లకు స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

New Update
Kalki 2898 AD: 'కల్కి'కి జాక్ పాట్.. ఓటీటీ రైట్స్ కోసం రెండు దిగ్గజ ప్లాట్ ఫార్మ్స్ బరిలో ...!

Kalki 2898 AD OTT: 2024 సంవత్సరంలో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రేక్షకుల నిరీక్షణ జూన్ 27తో ముగిసింది. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం జూన్ 27 న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన తొలిరోజు నుంచే రికార్డు వసూళ్లను రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. తొలి రోజు ఇండియాలో 95 కోట్ల వసూళ్లు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 180 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

ఓటీటీ విడుదల

ఇక కల్కి థియేటర్స్ లో సందడి చేస్తుండగానే.. ఓటీటీ విడుదలకు సంబంధించిన అప్డేట్ వైరలవుతోంది. కల్కి 2898 AD రెండు OTT ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కల్కి 2898 AD నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime) రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.

నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్

హిందీలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ఈ సినిమా హక్కులను 175 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా.. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో 200 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే థియేటర్లలో విడుదలైన రెండు నెలల వరకు సినిమా ఏ OTT ప్లాట్‌ఫారమ్‌లోనూ విడుదల చేయబడదని సమచారం. ఈ సినిమాలో భైరవుడి పాత్రలో ప్రభాస్ నటించాడు. స్టార్ కాస్ట్ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also Read: IMDB Rating: టాప్ రేటింగ్ ఇండియన్ రియాలిటీ షోస్.. బిగ్‌బాస్‌ షో IMDB రేటింగ్‌ ఎంతో తెలుసా? - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Shruti Haasan: నన్ను ఎవరూ ఆనందపరచలేదు.. బ్రేకప్ లిస్ట్ పై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్!

స్టార్ నటి శృతిహాసన్‌ తన ప్రేమకథ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బ్రేకప్స్ వల్ల చాలా స్ట్రగుల్ అయ్యానని చెప్పింది. ‘ఇతడు ఎన్నో బాయ్‌ఫ్రెండ్‌?’ అని అడుగుతుంటే బాధగా ఉంటుంది. కానీ నా దృష్టిలో బ్రేకప్ కేవలం నంబర్‌ మాత్రమే' అని చెప్పింది. 

New Update
dsruthi

Shruti Haasan interesting comments about love storys

Shruti Haasan: స్టార్ నటి శృతిహాసన్‌ తన ప్రేమ, పెళ్లి గురించి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు తన పేరెంట్స్ డివోర్స్ కారణంగా తాము ఎదుర్కొన్న అవమానాలను షేర్ చేసుకుంది. ముఖ్యంగా లవ్ స్టోరీస్, బ్రేకప్స్ వల్ల చాలా స్ట్రగుల్ అయ్యానని, తన జీవితంలోకి వచ్చిన వారెవరు ఆనందాన్ని ఇవ్వలేకపోయారని తెలిపింది. 

Also Read :  గిల్ నువ్ సుపరెహే.. సచిన్ కూతురుతో డేటింగ్‌‌పై షాకింగ్ రియాక్షన్.. 3 ఏళ్ళ నుంచి!

ఎన్నో బాయ్‌ఫ్రెండ్‌?

ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. ‘నా లైఫ్ లో అత్యంత బాధపడిన సందర్భం లేదు. నాకెంతో ఇష్టమైన వారిని కూడా బాధపెట్టాను. వారికి జీవితాంతం సారీ చెబుతూనే ఉంటా' అని చెప్పింది. ఇక ప్రతి ఒక్కరికి లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంటుందని, తనకు కూడా చాలా బ్రేకప్‌ స్టోరీలున్నాయని చెప్పింది. అయితే బ్రేకప్‌ తర్వాత దాని గురించి ఆలోచించనని, ‘ఇతడు ఎన్నో బాయ్‌ఫ్రెండ్‌?’ అంటూ అడుగుతుంటారని తెలిపింది. కానీ తన దృష్టిలో బ్రేకప్ కేవలం నంబర్‌ మాత్రమేనని చెప్పేసింది. కొన్నిసార్లు ఇతరుల మాటలు బాధపెడుతుంటాయని, తాను కూడా మనిషినేనని చెప్పింది.

Also Read :  భారత్,పాక్ సరిహద్దుల్లో హై టెన్షన్.. అధికారులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎమర్జెన్సీ మీటింగ్!

ఇక ‘గబ్బర్‌సింగ్‌’ సినిమా తన కెరీర్ కు బూస్ట్ ఇచ్చిందని, అంతకుముందు తనను ఐరన్ లెగ్ అంటూ ట్రోలింగ్ చేశారని వాపోయింది. ఫెయిల్ అయిన సినిమాల్లో హీరోను కాకుండా కేవలం తనను మాత్రమే టార్గెట్ చేయడం బాధకరమని చెప్పింది. ‘గబ్బర్‌సింగ్‌’ తర్వాతే నా కెరీర్ ఊపందుకుంది. అయినా నేను నాకు నచ్చిన సినిమాల్లోనే నటించాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది. 

Also Read :  చెలరేగిపోయిన రికిల్టన్, సూర్య.. లక్నో ముందు భారీ టార్గెట్

Also Read :  గిల్ నువ్ సుపరెహే.. సచిన్ కూతురుతో డేటింగ్‌‌పై షాకింగ్ రియాక్షన్.. 3 ఏళ్ళ నుంచి!

sruthihasan | love | breakup | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment