Kejriwal: కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తప్పదా..మెడకు చుట్టుకున్న మరో కేసు!

మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ కి ఈడీ 9 సార్లు నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ ఆయన ఒక్కసారి కూడా ఈడీ ముందుకు రాకపోగా..ఈడీ మీద ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్‌ కూడా తప్పదనే టాక్‌ వినిపిస్తుంది.

New Update
CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఎదురుదెబ్బ

Kejriwal: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ (Election Schedule) విడుదలైన తరువాత దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ముందు మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ను ఈడీ అదుపులోనికి తీసుకుని అరెస్ట్‌ చేసింది. ఈ క్రమంలోనే మరో అరెస్ట్‌ కూడా తప్పదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. అది మరెవరిదో కాదు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ది.

ఇప్పటికే ఆయనకు మద్యం కుంభకోణం కేసులో ఈడీ 9 సార్లు నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ ఆయన ఒక్కసారి కూడా ఈడీ ముందుకు రాకపోగా..ఈడీ మీద ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్‌ కూడా తప్పదనే టాక్‌ వినిపిస్తుంది. గతేడాది ఫిబ్రవరి ఆప్‌ మంత్రి, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)లో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ విచారణలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం తెలిపింది.మార్చి 18న విచారణకు హాజరు కావాలని ముఖ్యమంత్రిని కోరుతూ సమన్లు జారీ చేశారు.

మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేజ్రీవాల్‌ పై నమోదైన రెండవ కేసు ఇది.ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసు గురించి పార్టీకి తెలియదని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి ఆదివారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఆమె కేసును 'ఫేక్' అని కూడా పేర్కొన్నారు.

"అరవింద్ కేజ్రీవాల్‌కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుండి మరో సమన్లు అందాయి. ఢిల్లీ జల్ బోర్డ్‌కు సంబంధించిన కొన్ని విచారణల్లో పాల్గొనమని వారు అతనిని కోరారు. ఈ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసు గురించి మాకు తెలియదు. ఇందులో అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు వచ్చాయి. ఇది ఒక ఫేక్ కేసు" అని అతిషి చెప్పారు.

ఢిల్లీ జల్ బోర్డు విషయం ఎవరికీ తెలియదని, ఢిల్లీ ఎక్సైజ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయగలరా అనే సందేహం ప్రధాని మోదీకి ఉన్నందుకే ఈ సమన్లు పంపబడుతున్నాయని ఆమె అన్నారు."అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి బ్యాకప్ ప్లాన్ ను కేంద్రం ప్రారంభించింది " అని అతిషి మాట్లాడారు.

తనకు పంపుతున్న సమన్లన్నీ కూడా చట్ట విరుద్దంగా ఉన్నాయని కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఈడీ సమన్లు చట్టవిరుద్దమని, కానీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులకు సమాధానం ఇవ్వడానికి తాను సిద్దంగా ఉన్నట్లు కేజ్రీవాల్‌ ఇంతకు ముందే పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నాయకులను ఈడీ ద్వారా వేధిస్తున్నట్లు, బీజేపీ(BJP) లో చేరమని బలవంతం చేస్తున్నారని ఆరోపించారు.

ఈ కేసులో ఇప్పటివరకు ఆప్‌ నేతలు మనీష్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్‌, పార్టీ కమ్యూనికేషన్స్‌ ఇన్‌చార్జి విజయ్‌ నాయర్‌తో పాటు కొందరు మద్యం వ్యాపారులను దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది.

Also read: పదేళ్ల తరువాత ఒకే వేదిక పై!

Advertisment
Advertisment
తాజా కథనాలు