Andhra Pradesh: HDFC బ్యాంకు డబ్బు చోరీ చేసిన ఉద్యోగి.. చివరికి

ఏపీలోని రాజమండ్రిలో HDFC బ్యాంకు ఏటీఎంలకు క్యాష్ ఫిల్లింగ్ చేసే ప్రైవేటు ఏజెన్సీలో పనిచేస్తున్న అశోక్‌ కుమార్‌ అనే ఉద్యోగి రూ.రెండున్నర కోట్లతో పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు 5 ప్రత్యేక బృందాలతో గాలించి నిందితుడిని పట్టుకున్నారు.

New Update
Andhra Pradesh: HDFC బ్యాంకు డబ్బు చోరీ చేసిన ఉద్యోగి.. చివరికి

ఏపీలోని రాజమండ్రిలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. HDFC బ్యాంకుకు చెందిన రూ.రెండున్నర కోట్లతో ఓ ఉద్యోగి పరారయ్యాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. HDFC బ్యాంక్ ఏటీఎంలకు క్యాష్ ఫిల్లింగ్ చేసే ప్రైవేటు ఏజెన్సీలో అశోక్‌ కుమార్‌ అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే 19 ఏటీఎంలలో డబ్బులు ఫిల్ చేసేందుకు దానవాయిపేట HDFC నుంచి రెండున్నర కోట్లు డ్రా చేశాడు. తోటి సిబ్బందికి తెలియకుండా రెండున్నర కోట్లతో జంప్‌ అయ్యాడు.

Also Read: ఏపీకి ఐపీఎస్‌ కేడర్‌ స్ట్రెంత్‌పై కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌

సమాచారం తెలుసుకున్న పోలీసులు 5 ప్రత్యేక బృందాలతో గాలించి నిందితుడిని పట్టుకున్నారు. జల్సాలకు అలవాటు పడి అశోక్ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడిని విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.

Also Read: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య లేఖ.. బ్రిటీష్ కాలం నుండి..

Advertisment
Advertisment
తాజా కథనాలు