EVM: ఈవీఎంలపై ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌.. భారత్‌లో రాజకీయ దుమారం

ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించాలని టెస్లా అధినేత ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించగా దీనికి మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఎలాన్ మస్క్‌ అభిప్రాయం అమెరికా, ఇతర దేశాలకు వర్తిస్తుందని.. భారత్‌లో ఈవీఎంలు సురక్షితమైనవని పేర్కొన్నారు.

New Update
EVM: ఈవీఎంలపై ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌.. భారత్‌లో రాజకీయ దుమారం

ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను (EVM) తొలగించాలని టెస్లా అధినేత ఎక్స్‌లో స్పందించిన సంగతి తెలిసిందే. మనుషులు లేదా అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) వల్ల ఈవీఎంలు హ్యాకింగ్ గుర్యయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల అమెరికాలోని ప్యూర్టో రికోలో ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఇలా స్పందిచారు. అయితే దీనిపై.. భారత రాజకీయాల్లో దుమారం రేపుతోంది.


Also read: అమూల్ ఐస్ క్రీములో జెర్రీ.. కంగుతిన్న కస్టమర్స్!

బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రం రాజీవ్ చంద్రశేఖర్ ఎలాన్ మస్క్ ట్వీట్‌పై స్పందించారు. ' ఇది భద్రత గల డిజిటల్ హార్ట్‌వేర్‌ను ఎవరూ తయారుచేయలేరని చెప్పే అతిపెద్ద తప్పుడు ప్రకటన. ఎలాన్‌ మస్క్‌ అభిప్రాయం అమెరికా, ఇతర దేశాలకు వర్తించవచ్చు. అక్కడ ఇంటర్నెట్‌తో అనుసంధానించబడ్డ ఓటింగ్ మెషిన్‌లను తయారుచేసేందుకు సాధారణ కంప్యూట్‌ ఫ్లాట్‌ఫాంలను వినియోగిస్తారు. కానీ ఇండియాలో ఉన్న ఈవీఎంలు ఒక పద్ధతిలో డిజైన్ చేయబడ్డాయి. వీటికి భద్రత ఉంటుంది. ఎలాంటి నెట్‌వర్క్‌కు, మీడియాకు వీటితో సంబంధం లేదు. బ్లూటుత్, వైఫై, ఇంటర్నేట్‌ కనెక్టివిటీ వీటికి ఉండదు. భారత్ చేసినట్లుగా ఈవీఎంలను తయారుచేయవచ్చు. దీనిపై ట్యూషన్‌ ఇచ్చేందుకు కూడా మేము సంతోషిస్తాము ఎలాన్‌' అంటూ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.

Also Read: గుజరాత్‌లో కుండపోత వర్షాలు

అయితే రాజీవ్‌ చంద్రశేఖర్ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కుడా స్పందించారు. భారత్‌లో ఉన్న ఈవీఎంలు బ్లాక్ బాక్స్‌. వీటిని పర్యవేక్షించేందుకు ఎవరికీ అనుమతి లేదు. మన దేశ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సంస్థలకు జవాబుదారీతనం లేనప్పుడు ప్రజాస్వామ్యం అనేది బూటకమని తేలుతుంది, అలాగే మోసానికి గురవుతుందని' రాహుల్ స్పందించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు