Telangana: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకనుంచి ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు తెలంగాణలో త్వరలోనే ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. తొలుత కరీంనగర్ - హైదరాబాద్, నిజామాబాద్ - హైదరాబాద్ మార్గాల్లో నడిపించాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్ డిపోలకు ఈ బస్సులు చేరుకున్నాయి. By B Aravind 18 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. మొదటి దశలో కరీంనగర్ - హైదరాబాద్, అలాగే నిజామాబాద్ - హైదరాబాద్ రూట్‌లలో నడిపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ బస్సులకు ఈ-సూపర్ లగ్జరీగా నామకరణం కూడా చేసింది. అయితే ఇప్పటికే కరీంనగర్ -2 డిపోకు 35, నిజామాబాద్ -2 డిపోకు 13 బస్సులు చేరుకున్నట్లు ఓ ఆర్టీసీ ఉన్నతాధికారి తెలిపారు. Also Read: గుడ్‌న్యూస్.. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించే అవకాశం టీజీఆర్టీసీ.. ప్రైవేటు సంస్థల నుంచి ఎలక్ట్రిక్ బస్సులను అద్దె తీసుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సిటీ బస్సులుగా, హైదరాబాద్ - విజయవాడ మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులుగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తోంది. ఇందులో ఏసీ, నాన్ ఏసీ మెట్రో డీలక్స్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే సూపర్ లగ్జరీలో ఎలక్ట్రిక్ బస్సులు రావడం తొలిసారి రానుండటం విశేషం. త్వరలోనే వీటిని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇప్పటికే కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు కూడా ఇంకా తిరుగుతున్నాయి. ఇప్పుడు వాటి స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల వల్ల అవసరమైన మేరకు ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది. అందుకే వీటీకి ప్రత్యామ్నాయంగా డీజిల్ బస్సుల నుంచి ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యమిస్తోంది. కొత్త బస్సుల కొనుగోలుకు ఖర్చు లేకుండా ఎలక్ట్రిక్ బస్సలను అద్దెకు తీసుకుంటోంది. ఈ బస్సుల్లో డ్రైవర్లుగా వాటి తయారీ సంస్థ సిబ్బందే ఉంటారు. కండక్టర్లు మాత్రం ఆర్టీసీ నుంచే ఉంటారు. ఈ బస్సులకు కిలోమీటర్ల వారీగా ఆ సంస్థలకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. Also Read: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు అలెర్ట్.. మరో కీలక అప్‌డేట్ #telugu-news #telangana #national-news #electric-bus మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి