National : 6 రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ ఈసీ ఆదేశాలు

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఈసీ మొదటిసారి చర్యలు తీసుకుంది. ఆరు రాష్ట్రాల్లో ఉన్నతాధికారులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ డీజీపీతో పాటూ మరో ఉన్నతాధికారిని కూడా బదిలీ చేయాలని ఆదేశించింది.

New Update
Elections : జమ్మూ కాశ్మీర్‌తోపాటు మరో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు

Big Action OF EC : ఎన్నికల కోడ్(Election Code) అమల్లోకి వచ్చాక ఈసీ(EC) మొదటిసారి చర్యలు తీసుకుంది. ఆరు రాష్ట్రాల్లో ఉన్నతాధికారులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్(West Bengal) డీజీపీ రాజీవ్‌కుమార్‌(DGP Rajiv Kumar) తో పాటూ మరో ఉన్నతాధికారిని కూడా బదిలీ చేయాలని ఆదేశించింది. వీరితో పాటూ గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శిని తొలగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా మిజోరం, హిమాచల్ ప్రదేశ్‌లోని సాధారణా పరిపాలనా విభాగం కార్యదర్శితో పాటూ సీఎం కార్యాలయాలకు అనుబంధంగా ఉన్న సీనియర్ అధికారుల మీద కూడా వేటు వేసింది. ఇది కాక మరోవైపు బృహన్ ముంబై మున్సిపల్ కమీషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్, అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను కూడా కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది.

లోక్ సభ(Lok Sabha) తో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీ(Assembly Elections Date) ని శనివారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తేదీని మారుస్తూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌ 2న అరుణాచల్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ చేపట్టనుంది. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ జూన్‌ 4న యథాతథం జరగనుంది.

మొత్తం ఏడు ఫేజ్‌లలో

దేశంలో ఎన్నికల సంబరానికి తెరలేచింది. ఎలక్షన్‌ షెడ్యూల్‌ రిలీజ్ అయ్యింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం(ECI) ప్రకటించింది. దీంతో పాటు సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ఈసీ అనౌన్స్ చేసింది. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఎన్నికల సంఘం ఈ షెడ్యూల్‌ని విడుదల చేసింది.

➡ మార్చి 20న లోక్ సభ ఎలక్షన్‌ నోటిఫికేషన్‌
➡ జూన్‌ 4న కౌంటింగ్‌
➡ ఫేజ్‌ 1- ఏప్రిల్‌ 19
➡ ఫేజ్‌ 2- ఏప్రిల్ 26
➡ ఫేజ్‌ 3 – మే 7
➡ ఫేజ్‌ 4-మే 13
➡ ఫేజ్‌ 5- మే 20
➡ ఫేజ్‌ 6- మే 25
➡ ఫేజ్‌ 7- జూన్ 1

Also Read : Andhra Pradesh : ఈనెల 27 నుంచి మేమంతా సిద్ధం అంటూ ప్రచారంలోకి వైసీపీ

Advertisment
Advertisment
తాజా కథనాలు