Election Commission: చికెన్‌కు రూ.250, మటన్‌కు రూ.500.. ఈసీ మెనూకార్డులో టీ, ఇడ్లీ ధర ఎంతో తెలుసా?

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై ఎలక్షన్ కమిషన్ ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల వరకు పరిమితి నిర్ధారించింది. అలాగే ఒక్కో ప్రాంతంలో చాయ్‌, సమోసా, టిఫిన్స్, చికెన్‌, మటన్‌ ధరలను కూడా నిర్ణయిస్తూ మెనూ కార్డు విడుదల చేసింది.

New Update
Elections: ఎన్నికల సిబ్బంది నిబంధనలు ఉల్లంఘిస్తే జరిగేది ఇదే..!

Election Commission: మరో నెలరోజుల్లో లోక్‌సభ ఎన్నికలు మొదలుకానున్న సంగతి తెలసిందే. దీంతో అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై ఎలక్షన్ కమిషన్ ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల వరకు పరిమితి నిర్ధారించింది. ఇక గోవా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో రూ.75 లక్షల పరిమతి విధించింది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో అయితే రూ.75-95 లక్షల మధ్య ఉంది. అయితే నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచి లోక్‌సభ ఎన్నికలు ఫలితాలు వచ్చేదాకా అభ్యర్థులు.. ఎన్నికల వ్యయ పరిమితి దాటకుండా చూసేలా ఈసీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.

Also Read: 56 కోట్లకు 12 ఫ్లాట్లు కొన్న మహిళ!

అంతేకాదు.. ఎన్నికల అభ్యర్థులకు సంబంధించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు, సభా వేదికల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఆహారం వరకు ఇలా అన్నింటికీ రేట్‌ను నిర్ధారిస్తోంది ఈసీ. ఈసీ మెనూ కార్డుకు సంబంధించి సోషల్‌ మీడియాలో చేస్తున్న జోక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఈసీ ఇలా నిబంధనలు పెట్టినప్పటికీ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం పరిస్థితులు వేరేలా ఉంటాయి.

చాయ్‌ ధర రూ.5 నుంచి రూ.15

ఇక ఈసీ పెట్టిన ధరలను చూస్తే.. దేశంలో చాయ్‌ను ప్రాంతాన్ని బట్టి రూ.5 నుంచి రూ.15 వరకు పెంచారు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ ప్రాంతంలో చాయ్ ధర రూ.5, సమోసా రూ.10, ఇడ్లీ, సాంబర్ వడా, పోహా-జిలేబి ఒక్క ప్లేటుకు రూ.20లు అలాగే ఉప్మా, దోసా మాత్రం రూ.30గా నిర్ణయించింది. మణిపూర్‌లోని తౌబల్‌ జిల్లాలో చాయ్, కచోరీ, సమోసా ధరలు రూ.10. తెంగ్‌నౌపాల్ అనే మరో జిల్లాలో బ్లాక్ టీ రూ.5, సాదీ టీ రూ.10గా ఉంది. అలాగే మణిపూర్‌లో బాతు మాంసం రూ.300, పంది మాంసం రూ.400. అలాగే ఇక్కడి ఈసీ మెనులో చికెన్‌తో సహా చేపలు కూడా ఉన్నాయి. జలంధర్‌లో చూసుకుంటే.. కిలో చికెన్‌ ధర రూ.250, మటన్‌కు రూ.500గా నిర్ణయించారు. అలేగే గ్లాసు లస్సీ రూ.20, నిమ్మరసం రూ.15గా ఉంది.

Also read: ఆప్ మంత్రి కి సమన్లు జారీ చేసిన ఈడీ!

తగ్గిన చికెన్ ధర 

మరోవైపు చెన్నైలో చాయ్‌ ధర రూ.10 నుంచి రూ.15గా ఈసీ ధరలను నిర్ణయించింది. కాఫీ రూ.15 నుంచి రూ.20కి పెరిగింది. చికెన్ బిర్యానీ ధరను మాత్రం అనూహ్యంగా రూ.180 నుంచి రూ.150కి తగ్గించింది. ఇక గోవాలో వడ, సమోసా రూ.15, చాయ్‌ రూ.15, కాఫీ రూ.20గా నిర్ణయించారు. ఢిల్లీ శివార్లలో నోయిడా పరిధిలో వెజ్‌ భోజనం రూ.100. సమోసా, చాయ్‌ రూ.10గా ఉంది. హర్యాణాలోని జింద్‌లో మఖానీ, మిక్స్‌డ్‌ వెజ్‌ కర్రీ ధర రూ.130, మటన్‌ పనీర్‌ రూ.160 గా నిర్ణయించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు