Telangana : రాష్ట్రంలో 10 విశ్వవిద్యాలయాలకు కొత్త వీసీలు..

తెలంగాణలో 10 యూనివర్సిటీలోకు కొత్త వైస్ ఛాన్స్‌లర్ల (VC) నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర విద్యాశాఖ.. ఈ నెలాఖరులోగా కొత్త వీసీలను ఎంపిక చేసే ప్రక్రియను పూర్తి చేసి.. నియామక ఉత్తర్వులు జారీ చేయనుంది.

New Update
Telangana : రాష్ట్రంలో 10 విశ్వవిద్యాలయాలకు కొత్త వీసీలు..

VC Recruitment In Telangana : తెలంగాణ(Telangana)లో 10 యూనివర్సిటీలోకు కొత్త వైస్ ఛాన్స్‌లర్ల(VC) నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) పర్మిషన్ ఇచ్చింది. రాష్ట్రంలో పోలింగ్(Polling) ముగియడంతో ఈ ప్రక్రియ చేపట్టవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో వీసీల ఎంపిక కోసం సెర్చ్ కమిటీలను నియమిస్తూ రాష్ట్ర సర్కార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల అప్లికేషన్లను ముందుగా ఈ సెర్చ్‌ కమిటీలు పరిశీలిస్తాయి. ఆ తర్వాత ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురు ప్రొపెసర్ల చొప్పున పేర్లు ఎంపిక చేస్తాయి. అనంతరం వీటి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గవర్నర్‌కు పంపిస్తాయి.

Also Read: నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ శ్రేణుల ధర్నా..

గవర్నర్ ఆమోదించిన తర్వాత.. యూనివర్సిటీల్లో(Universities) వీసీల నియామకాలపై ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడుతాయి. అయితే ఈ నెలఖరులోగా కొత్త వీసీలను ఎంపిక చేసే ప్రక్రియను పూర్తి చేసి.. నియామక ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

Also Read: తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలే ..వర్షాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు