Sharad Pawar: శరద్‌పవార్ కు ఈసీ నోటీసులు శరద్‌పవార్ కు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆయనకు నోటీసులు ఇచ్చింది. అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ గడియారం గుర్తును అజిత్ వర్గానికి కేటాయించింది. By V.J Reddy 06 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Sharad Pawar: మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్సీపీ నుంచి విడిపోయిన అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. శరద్‌పవార్ కు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ గడియారం గుర్తును అజిత్ వర్గానికి కేటాయించింది. EC settles the dispute in the Nationalist Congress Party (NCP), rules in favour of the faction led by Ajit Pawar, after more than 10 hearings spread over more than 6 months. Election Commission of India provides a one-time option to claim a name for its new political formation… pic.twitter.com/1BU5jW3tcR — ANI (@ANI) February 6, 2024 ఇది కాంగ్రెస్ కు షాకే.. లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించాలని విపక్షా పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్నికల కమిషన్ మహారాష్ట్ర లోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌పవార్ కు ఊహించని షాక్ ఇచింది ఇచ్చింది. పార్టీ, చిహ్నం అజిత్ పవార్ కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ కు లోక్ సభ ఎన్నికలల్లో మహారాష్ట్రలో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీనికి ప్రధాన కారణం శరద్ పవార్ ఇండియా కూటమిలో ఉండడమే. పార్టీ పేరు, చిహ్నం అజిత్ పవార్ కు కేటాయించడంతో ఆ పార్టీ పూర్తి హక్కులు శరద్ పవార్ చేతి నుంచి చేజారాయి. Serious inconsistencies in terms of timelines in the claim of the Sharad Pawar group, in support of their claim of having organizational majority, resulted in unreliability of their claim. Taking into account the significant timeline of the elections to the 6 seats of Rajya Sabha… — ANI (@ANI) February 6, 2024 బీజేపీకి ప్లస్... ఎన్సీపీ విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం బీజేపీకి ప్లస్ పాయింట్ అయింది. లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో అడ్డంకి లేకుండా చేసింది. దీనికి ప్రధాన కారణం కొద్ది నెలల క్రితం వరకు అజిత్ పవార్ ఇండియా కూటమిలోనే ఉండేవాడు. కానీ ఇటీవల రాజకీయ పరిణామాలు మారడంతో తన వర్గం ఎమ్మెల్యేను తీసుకొని అజిత్ పవార్ బీజేపీ, శివసేనల కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగం అయ్యారు. దీంతో మహారాష్ట్రలో బీజేపీకి లోక్ సభ ఎన్నికల్లో ఓటమిని అనేదే లేకుండా అయింది. ఇది శరద్ పవార్ తో పాటు ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. DO WATCH: #ajith-pawar #election-commission #ncp #sharad-pawar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి