No Smoking : శృంగార జీవితానికి.. పొగ తాగడానికి ఉన్న సంబంధం ఏంటి..?

పొగ తాగడం లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పొగాకులోని నికోటిన్, పురుషాంగానికి బ్లడ్ సరఫరా చేసే నాళాలతో పాటు బాడీ అంతటా రక్త ప్రవాహాన్ని నిరోధిస్తుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. సిగరెట్ తాగే వారిలో స్పెర్మ్ కౌంట్‌తోపాటు, సంతానోత్పత్తికి ఆటంకం కలుగుతుంది.

New Update
No Smoking : శృంగార జీవితానికి.. పొగ తాగడానికి ఉన్న సంబంధం ఏంటి..?

Smoking : పొగ తాగడం(Smoking) ఆరోగ్యానికి హానికరమని అందరికి తెలుసిందే. ఇది క్యాన్సర్‌(Cancer) తోపాటు ఇతర వ్యాధులకు కారణమవుతుందని వైద్యులు చెబుతుంటారు. దీంతో చివరకు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది దీని కారణంగా క్యాన్సర్‌ బారిన పడుతున్నారని ప్రస్తుతం నివేదికలో వెల్లడైంది. కొన్ని రకాల టెన్షన్ల కారణంగా ఈ అలవాటు స్టార్ట్ చేసి.. క్రమంగా పొగకు బానిస అవుతున్నారు. అంతేకాకుండా సిగరెట్ తాగేవారితోపాటు పక్కన ఉన్న వారికి ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు వలన పక్షవాతం, ఊపిరితిత్తుల క్యాన్సర్(Lung Cancer), హృదయ సంబంధ వ్యాధులు, వివిధ క్యాన్సర్లతో పాటు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 13.50 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అధ్యాయనాలు చెబుతున్నాయి. పురుషులు, మహిళలు పొగ తాగడం వలన లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుందట. సిగరెట్ తాగడానికి, లైంగిక ఆరోగ్యానికి మధ్య అనుసంధానం ఉంది. ఇది లిబిడో, లైంగిక పనితీరు, సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుందని నిపుణులు వెల్లడించారు. అయితే.. ధూమపానానికి.. శృంగారజీవితానిక మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

వీర్యం, యోని సమస్యలు:

  • పొగాకు(Tobacco) లో ఉండే అనేక డేంజరస్ రసాయనాలు వలన వీర్యంతోపాటు, యోని ద్రవాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ధూమపాన, మద్యం, కాఫీ, డ్రగ్స్ వంటి ఇతర పదార్థాలు దుర్వాసనతో కూడినవి ఇందుకు కారణం.

రక్త ప్రవాహాన్ని నిరోధిస్తుంది:

  • పొగాకులోని వ్యసనపరుడైన నికోటిన్, పురుషాంగానికి బ్లడ్ సరఫరా చేసే నాళాలతో పాటు బాడీ అంతటా రక్త ప్రవాహాన్ని నిరోధిస్తుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.

అండం నాణ్యత క్షీణించడం:

  • సిగరెట్ తాగడం వల్ల స్త్రీలు సంతానోత్పత్తి సవాళ్లను ఎదుర్కొంటారు. ధూమపానం అండాశయ నిల్వల క్షీణతను వేగవంతం చేసి అండం సంఖ్య తగ్గడానికి, అండం నాణ్యత క్షీణించడానికి దారితీస్తుందని అధ్యయనంలో తెలింది. అంతేకాదు సిగరేట్ తాగే మహిళలు 50 ఏళ్లలోపు మెనోపాజ్‌ సంతానోత్పత్తిని ప్రభావితం చేయడంతో పాటు అనేక ఆరోగ్య ప్రమాదాలతో ముడిపడి ఉందని నిపుణులు చెబుతున్నారు.

స్పెర్మ్‌కౌంట్ తగ్గడం

  • తండ్రులు కావాలని కోరుకునే అందరికి ఉంటుంది. స్పెర్మ్ కౌంట్(Sperm Count) తగ్గడానికి ముఖ్య కారణం ధూమపానం. సిగరెట్ తాగే వారిలో స్పెర్మ్ కౌంట్‌తోపాటు, సంతానోత్పత్తికి ఆటంకం, పురుషుల్లో వీర్యం తగ్గడం, టోటల్ స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ చలనశీలత తగ్గిస్తుందని వెల్లడైంది.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే టిఫిన్‌కు బదులు అన్నం తింటే ఏమవుతుంది?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Allu Arjun- Atlee: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై భారీ హైప్ నెలకొంది. బన్నీ డ్యూయల్ రోల్, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఉండనున్నారని టాక్‌ ప్రచారంలో ఉంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది.

New Update
Allu Arjun – Atlee

Allu Arjun – Atlee Movie

Allu Arjun- Atlee : ఇటీవల టాలీవుడ్ లో హైప్ క్రియేట్ చేసిన ఓ భారీ ప్రాజెక్ట్ ఏమిటంటే.. అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో రూపొందనున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చిన నాటి నుంచి ఎన్నో ఆసక్తికర రూమర్స్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై, కొన్ని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారన్న టాక్ హీట్ పెంచింది. అంతేకాదు, ఈ చిత్రానికి గ్లోబల్ స్టాండర్డ్స్‌ను లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల, హీరోయిన్ పాత్రకు బాలీవుడ్ టాప్ స్టార్ ప్రియాంక చోప్రా పేరు తెరపైకి వచ్చింది. హాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెను ఎంపిక చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

ఇప్పటికే ప్రియాంక చోప్రా, మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఇంటర్నేషనల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సరసన కూడా ఆమె కనిపిస్తే, అది మరో క్రేజీ కాంబోగా మారనుంది. అయితే దీనిపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: ఫ్యాన్స్ కు మెగా ట్రీట్.. 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.

ఈ గ్రాండ్ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. బడ్జెట్ పరంగా, విజువల్ ట్రీట్ పరంగా ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో తెరకెక్కించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని సమాచారం.

Also Read: 'ప్రభాస్'ని పక్కన పెట్టి అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ..!

మొత్తానికి అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ హైప్‌ను సృష్టించగా, కథ, తారాగణం, టెక్నికల్ టీమ్ డీటెయిల్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment