Smartphones : పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇస్తున్నారా ? పరిశోధకుల హెచ్చరిక..!

పిల్లలు ఎక్కువసేపు స్మార్ట్‌ఫోన్ వాడితే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. ఒకరోజులో నాలుగు గంటల కన్నా ఎక్కువసేపు స్మార్ట్‌ఫోన్లు వాడితే ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు, దురాలవాట్లు పెరుగుతున్నాయని బయటపడింది.

New Update
Smartphones : పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇస్తున్నారా ? పరిశోధకుల హెచ్చరిక..!

Scientists Warning : ఒకప్పుడు పిల్లలు అంటే స్కూల్ నుంచి రాగానే బయట ఆటలు ఆడుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. మొత్తం స్మార్ట్‌ఫోన్‌లోనే గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం లాంటివి చేస్తున్నారు. ఈమధ్య చాలామంది పిల్లలు ఫోన్ చూపించందే అన్నం కూడా తినడం లేదు. ఇక చేసేదేం లేక వాళ్ల పేరెంట్స్ అలా ఫోన్‌లో వీడియోలు చూపిస్తూనే అన్నం తినిపిస్తున్నారు. అయితే పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్లు(Smartphones) ఇవ్వడంపై వైద్య పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పిల్లల(Students) మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుందని దక్షిణ కొరియాకు చెందిన హన్యాంగ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ జరిపిన అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ఒకరోజులో నాలుగు గంటల కన్నా ఎక్కువసేపు స్మార్ట్‌ఫోన్లు వాడితే యుక్తవయసున్న పిల్లల్లో తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించింది.

Also Read: రాష్ట్రంలో పెరుగుతోన్న చలి.. వాతావరణ శాఖ కీలక ప్రకటన

ప్రస్తుతం ప్రతిఒక్కరి చేతికి స్మార్ట్‌ఫోన్లు రావడంతో.. వీటి వాడకం పిల్లల్లో పెరిగిపోయింది. ఇది మానసిక జబ్బులతో పాటు.. నిద్ర, కళ్లు, ఎముకలకు అంటుకునే కండరాల సమస్యకు దారితీస్తున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. వీటి మధ్య సంబంధాన్ని లోతుగా తెలుసుకునేందుకు మరింత దృష్టి సారించారు. రోజుకు నాలుగు గంటల కన్నా ఎక్కువసేపు వాడేవారిలో.. ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతున్నాయని.. అలాగే దురాలవాట్లకు కూడా అలవాటు పడుతుట్లు గుర్తించారు. అందుకే పిల్లలకు ఎక్కువసేపు స్మార్ట్‌ఫోన్లలో గడపకూడదని హెచ్చరిస్తున్నారు.

Also Read: చలికాలంలో ఈ సమస్యలా..నిర్లక్ష్యం చేయకండి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Liquor scam : లిక్కర్​స్కాంలో మరో కొత్త పేరు..ఎవరంటే?

వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కసిరెడ్డిని సిట్ విచారిస్తుంది.ఈ విచారణ సందర్భంగా పలువురి పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి నుంచి కసిరెడ్డిని సిట్​చీఫ్ రాజశేఖర్ విచారిస్తున్నారు. ఈ కేసులో బల్లం సుధీర్‌ అనే పేరు తెరపైకి వచ్చింది.

New Update
Kasireddy Rajasekhar Reddy

Kasireddy Rajasekhar Reddy

 AP Liquor scam : వైసీపీ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్నీ తానై వ్యవహరించిన కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్‌ రాజ్‌ కెసిరెడ్డి ఎట్టకేలకు అరెస్టయ్యారు. ఆయనను సోమవారం సాయంత్రం 6.20 గంటల సమయంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌ కెసిరెడ్డి రాజేష్‌రెడ్డి అనే మారు పేరు, నకిలీ గుర్తింపు పత్రాలతో గోవా నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్‌లో దిగారు. విమానాశ్రయంలో అప్పటికే మాటు వేసిన సిట్‌ అధికారులు పట్టుకున్నారు. అరెస్టు చేసినట్లు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. శంషాబాద్‌ నుంచి రాత్రి 11.10 గంటలకు ఆయన్ను విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఉన్న సిట్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు. మంగళవారం కోర్టులో హాజరుపరుస్తారు. 

ఇది కూడా చూడండి: Holiday Culture: హాలీడే కల్చర్‌ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్ల
 
కాగా రాజ్‌ కెసిరెడ్డి.. సిట్‌ జారీ చేసిన నోటీసుల చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ, ముందస్తు బెయిల్‌ కోరుతూ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటి విచారణలన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు ఆయనపై లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ అయింది. మరోవైపు రాజ్‌ కెసిరెడ్డి విచారణకు ఏ మాత్రం సహకరించకపోవటంతో.. ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, బినామీలు, మద్యం కుంభకోణం సొత్తును పెట్టుబడులుగా పెట్టిన సంస్థలు, వాటి డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో సిట్‌ అధికారులు ఇటీవల వరుసగా 3 రోజులపాటు సోదాలు నిర్వహించారు. కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన తండ్రి ఉపేంద్రరెడ్డికి నోటీసులిచ్చారు. ఇలా అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధం చేయడంతో తప్పించుకోవటం సాధ్యం కాదని గుర్తించిన రాజ్‌ కెసిరెడ్డి.. హైదరాబాద్‌ నుంచి చెన్నైకు చేరుకుని అక్కడి నుంచి విదేశాలకు వెళ్లిపోవాలని కుట్ర చేశారు.  కానీ ఈ లోపు సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

ఎవరీ బల్లం సుధీర్‌ ?

కాగా కసిరెడ్డి విచారణ సందర్భంగా పలువురి పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తుంది.  నిన్న రాత్రి నుంచి కసిరెడ్డిని సిట్​చీఫ్ రాజశేఖర్ బాబు విచారిస్తున్నారు. ఈవిచారణలో సిట్ చీఫ్‌తో పాటు ఏడుగురు అధికారుల బృందం ఉంది. అయితే వసూళ్ల నెట్‌వర్క్‌తో తనకు సంబంధం లేదని కసిరెడ్డి చెబుతున్నట్లు సమాచారం. గతంలో విజయసాయి, మిథున్ సిట్​ఎదుట ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా విచారణ జరుగుతోంది. పలు ఆధారాలను చూపిస్తూ సిట్ బృందం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తెరపైకి బల్లం సుధీర్‌ అనే పేరు వచ్చింది. ఇతను కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. లావాదేవీలన్నీ సుధీర్ ద్వారానే జరిపినట్టు తెలుస్తుంది. ఇంతకు సుధీర్ ఎవరు అనే కోణంలో అధికారులు కూపీ లాగే పనిలో ఉన్నారు. ఏపీ, తెలంగాణలో ఇసుక మాఫియాలోనూ ఇద్దరూ ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. కసిరెడ్డి, సుధీర్​ కలిసి వందల కోట్ల రూపాయలు వెనుకేసుకొన్నట్లు సమాచారం. ఈ లిక్కర్​ స్కాంలో కేసిరెడ్డి తర్వాత సుధీర్​దే కీలకపాత్ర​అని అంటున్నారు. సుధీర్‌ అరెస్ట్‌ అయితే మరిన్ని సంచలనలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: Ap Tenth Results:రేపే ఏపీ టెన్త్‌ రిజల్ట్స్‌!

Also Read: Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ డెత్ రిపోర్ట్ వచ్చింది...అందులో ఏముందంటే..

Advertisment
Advertisment
Advertisment